NKR21: కళ్యాణ్ రామ్ సినిమా.. ఖతర్నాక్ అప్డేట్
ABN , Publish Date - Sep 14 , 2024 | 09:07 PM
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్‌ను మేకర్స్ వదిలారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న NKR21 సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్‌ను మేకర్స్ వదిలారు. ఆయన హీరోగా నటిస్తోన్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ చిత్రం #NKR21. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో.. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో.. అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం టీమ్ హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తోందని, ఇది 15 రోజుల పాటు కొనసాగుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇంకా ఈ యాక్షన్ ఎపిసోడ్ గురించి మేకర్స్ చెబుతూ.. (NKR21 Movie Latest Update)
Also Read- Thalapathy69: దళపతి విజయ్ చివరి చిత్ర ప్రకటన వచ్చేసింది..
దాదాపు 150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు షూట్‌లో పాల్గొంటున్న ఈ యాక్షన్ బ్లాక్‌ను ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ (Peter Hein Master) మాస్టర్ పర్యవేక్షిస్తున్నారని, ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో పీటర్ హెయిన్ మాస్టర్ సజెషన్స్ ఇస్తూ కనిపించారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanthi) ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు రామ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..
Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?
Read Latest Cinema News