Nara Rohith: పెదనాన్న.. అంటూ నారా రోహిత్ రాసిన లెటర్ వైరల్
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:02 PM
ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి (AP CM Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ (Nara Rohith) సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు.. నారా రోహిత్ లేఖకు స్పందిస్తూ.. మా మనసులోని మాట చెప్పారన్నా అంటూ విక్టరీ సింబల్‌తో రిప్లయ్‌లు ఇస్తున్నారు. ఇంతకీ నారా రోహిత్ విడుదల చేసిన లేఖలో (Nara Rohith Letter) ఏముందంటే..
‘‘పెదనాన్న,
గత నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశారు, తట్టుకున్నారు, ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత ఐదేళ్ల కాలంలో ఎంతో మధనపడ్డారు, పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లు అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదలించలేని స్థానం అని. ఈ ఎన్నికల్లో చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అనే సాహసం చెయ్యలేని విజయాన్ని అందుకున్నారు. ఆ విజయం NDA కూటమిది మాత్రమే కాదు, ఆంధ్రా ప్రజలది, తెలుగు వారిది. మన అందరిదీ.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు తెలుగుదేశం కార్యకర్తలందరి తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు..
ప్రేమతో మీ నారా రోహిత్’’ అని నారా రోహిత్ (Hero Nara Rohith) ఈ లేఖలో పేర్కొన్నారు.