Raj Tarun and Lavanya: ఏ1గా రాజ్ తరుణ్, అరెస్టు తప్పదా?

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:46 PM

రాజ్ తరుణ్ వలన తాను గర్భవతిని అయ్యానని, రెండవ నెలలో సర్జరీ జరిగిందని లావణ్య ఆధారాలతో సహా పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనని డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలు కావాలనే ఇరికించారని కూడా ఆ ఫిర్యాదులో లావణ్య పేర్కొనడం, ఈ కేసులో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి

Raj Tarun

రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య పెట్టిన కేసులో ఇప్పుడు కొత్త ట్విస్టులు బైటకి వస్తున్నాయి. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు ఆధారాలు కూడా చూపించమనటంతో లావణ్య అన్ని ఆధారాలను పోలీసులకి చూపించింది. నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాజ్ తరుణ్‌ని ఏ1గా పేర్కొన్నారు, అలాగే మాల్వి మల్హోత్రాని ఏ2గా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాను ఏ3గా చేర్చారు నార్సింగి పోలీసులు. ఈ ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది.

ఇందులో లావణ్య తనకి రాజ్ తరుణ్ పరిచయం అయిన దగ్గర నుండి ఎన్నాళ్ళు కలిసి వున్నారు, ఎప్పుడు పెళ్లిచేసుకున్నారు, ఎక్కడికి వెళ్లారు, ఏమేమి చేశారు అనే విషయాలు అన్నిటినీ ఆధారాలతో సహా పోలీసులకి ఇచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఇంకొక కొత్త ట్విస్టు కూడా ఈ కేసులో బయటపడింది. 2008 నుంచి రాజ్‌తరుణ్‌కు లావణ్య పరిచయం అయిన తరువాత, 2010 లో రాజ్ తరుణ్ లావణ్యకు ప్రపోజ్‌ చేసి, తరువాత 2014 లో తనని ఒక గుడిలో పెళ్లిచేసుకున్నాడు అని చెప్పింది లావణ్య.

rajtarunanvika.jpg

అలాగే రాజ్ తరుణ్ వలన తను గర్భవతిని అయ్యానని, అయితే రెండో నెలలోనే తనకి సర్జరీ చేశారని చెప్పింది లావణ్య. ఆసుపత్రికి అయ్యే ఖర్చులన్నీ రాజ్ తరుణ్ కట్టడాన్ని కూడా చెప్పింది లావణ్య. ఈ కేసులో ఇంకొక ట్విస్ట్ కూడా బయటపెట్టింది లావణ్య. తనని డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్, మాల్వి ఇరికించారని చెప్పింది లావణ్య. అలాగే మాల్వి, ఆమె సోదరుడు మయాంక్ తనని చంపుతారని బెదిరించారని కూడా లావణ్య చెప్పింది.

తన కుటుంబం రాజ్ తరుణ్ ని అన్నివిధాలా అడ్డుకుందని చెప్పింది లావణ్య. ఇప్పటివరకు రాజ్ తరుణ్ కి రూ.70 లక్షలు వరకు ఇచ్చామని కూడా చెపుతూ, రాజ్ తరుణ్ కి కుక్కలు అంటే ఇష్టం, అందుకని అతని పెంచుకున్న 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చాం అని చెప్పింది లావణ్య.

ఇప్పుడు నార్సింగి పోలీసులు పెట్టిన కేసుల వలన రాజ్ తరుణ్ అరెస్టు తప్పదా అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. లావణ్య లాయర్ కూడా రాజ్ తరుణ్ దగ్గర ఎటువంటి ఆధారాలు వున్నా తీసుకు రావాలని, ఏ ఆడపిల్లకి ఇటువంటి కష్టాలు రాకూడదని, రాజ్ తరుణ్ వలన లావణ్య చాలా నష్టపోయిందని చెపుతున్నాడు. మస్తాన్ అనే అతనితో లావణ్యకి సంబంధం ఉందని రాజ్ తరుణ్ చెప్పడం, దానికి రాజ్ తరుణ్ ఆధారాలు ఉంటే తీసుకురావాలని లాయర్ అడుగుతున్నాడు.

లావణ్యకి డబ్బులు వద్దని, ఏమీ వద్దని, రాజ్ తరుణ్ వచ్చి కోపంలో ఎదో మాట అన్నాను, నింద వేశాను, లావణ్య నా భార్య, నేను ఏలుకుంటాని అని చెపితే రాజ్ తరుణ్ పై కేసులు అన్నీ లావణ్య ఉపసంహరించుకుంటుంది అని చెప్పారు లావణ్య లాయర్ కళ్యాణ్ దిలీప్.

Updated Date - Jul 11 , 2024 | 03:10 PM