Parasuram Petla: ‘ఫ్యామిలీ స్టార్’కు నేను రాసిన ప్రతి మాట నా గుండెల్లో నుంచి వచ్చిందే..

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:42 PM

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కోసం బ్లడ్ అండ్ సోల్ పెట్టి పనిచేశామని అన్నారు దర్శకుడు పరశురామ్ పెట్ట. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

Parasuram Petla: ‘ఫ్యామిలీ స్టార్’కు నేను రాసిన ప్రతి మాట నా గుండెల్లో నుంచి వచ్చిందే..
Parasuram Petla About Family Star Movie

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కోసం బ్లడ్ అండ్ సోల్ పెట్టి పనిచేశామని అన్నారు దర్శకుడు పరశురామ్ పెట్ల. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల, విజయ్ అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

దర్శకుడు పరశురామ్ పెట్ల (Parasuram Petla) మాట్లాడుతూ.. ‘‘ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ సినిమాను ఇష్టపడతారు. ఈ కథలోని ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు. నేను, విజయ్ ‘గీత గోవిందం’ (Geetha Govindham) సినిమా చేశాం. మళ్లీ మేము కలిసి సినిమా చేస్తున్నామంటే అది గుర్తుండిపోయే మూవీ కావాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేసేందుకే ప్రయత్నించాను. విజయ్ ఈ కథ విన్నప్పుడు పడిన ఎగ్జైట్‌మెంట్, ఇందులో తను చేసిన గోవర్థన్ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయిన విధానం రేపు స్క్రీన్ మీద చూస్తారు. విజయ్ ఇప్పటి వరకు చేసిన పెర్ఫార్మెన్స్ ఒకెత్తు.. ఈ సినిమా మరో ఎత్తు అనుకోవచ్చు.


Family-Star.jpg

ఇందు క్యారెక్టర్‌ను మృణాల్ ఠాకూర్ అద్భుతంగా పోషించింది. తెలుగు డైలాగ్స్ నేర్చుకుంది. ఇందు, గోవర్థన్ (Indu and Govardhan) క్యారెక్టర్స్ మీకు ఎంతో సహజంగా అనిపిస్తాయి. గోవర్థన్ అంటే మీరూ నేనూ మనలో ఒక వ్యక్తి. పరుగు సినిమాకు ఎస్వీసీ సంస్థలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. అప్పుడే రాజు గారి బ్యానర్‌లో మూవీ చేయాలని కోరిక కలిగింది. ఈ సినిమాకు నేను రాసిన ప్రతి మాట నా గుండెల్లో నుంచి వచ్చిందే. బ్లడ్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకు పనిచేశాను. నేనే కాదు టీమ్ అంతా అలాగే కష్టపడ్డారు. సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, సంగీత దర్శకుడు గోపీ సుందర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వాసు వర్మ.. ఇలా ప్రతి ఒక్కరం టీమ్ వర్క్‌గా మంచి సినిమా చేశాం. సక్సెస్ మీట్‌తో మిమ్మల్ని త్వరలోనే కలుస్తాం..’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?

**************************

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

Updated Date - Apr 03 , 2024 | 02:42 PM