Pawan Kalyan: నా ప్రమాణస్వీకారం అనంతరం‌ వచ్చి కలుద్దామని అనుకున్నా.. ఇంతలోనే!

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:03 PM

నా ప్రమాణస్వీకారం అనంతరం‌ రామోజీరావు గారిని వచ్చి కలవాలనుకున్నాను.. ఇంతలోనే ఈ సంఘటన జరిగిందని బాధపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు.

Pawan Kalyan: నా ప్రమాణస్వీకారం అనంతరం‌ వచ్చి కలుద్దామని అనుకున్నా.. ఇంతలోనే!
Pawan Kalyan along with Trivikram Paid Final Respects to RamojiRao

నా ప్రమాణస్వీకారం అనంతరం‌ రామోజీరావు (Ramoji Rao) గారిని వచ్చి కలవాలనుకున్నాను.. ఇంతలోనే ఈ సంఘటన జరిగిందని బాధపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan). తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)తో కలిసి మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు.

Also Read- RamojiRao: రామోజీరావు.. ఆ కోరిక తీరకుండానే..!


Kalyan.jpg

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రామోజీరావుగారి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. నా ప్రమాణస్వీకారం అనంతరం‌ వచ్చి ఆయనని కలవాలనుకున్నాను. ఆయనని గత ప్రభుత్వాలు ఎంతో ఇబ్బంది పెట్టాయి. ఆ ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. అయినా కూడా అన్నింటిని తట్టుకుని ప్రజలను చైతన్యవంతం చేశారు. వేలాది జర్నలిస్ట్‌లను తయారు చేశారు. సినీ పరిశ్రమకు వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. మా విజయాన్ని వారికి తెలియజేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. వారి కుటుంబానికి, రామోజీ గ్రూప్ ఆఫ్ సంస్థల సభ్యులకు జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. (Pawan Kalyan Condolences To Ramoji Rao)


Chiranjeevi.jpg

రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నాయుడు దంపతులు నివాళులు అర్పించారు. వారే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేష్ దంపతులు, నాగార్జున వంటి వారెందరో రామోజీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడిని. ఆ సమయంలో ఒక పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకున్నారు. తెగ సంబరపడిపోయారు. అంతేకాదు, ఆయన దాచుకున్న పెన్నులను కూడా చూపించారు. రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి. అందరూ ఆయనలో గంభీర్యాన్ని చూస్తే, నేను చిన్న పిల్లాడిని చూశా. ఇప్పుడు మనమంతా ఒక పెద్దని, శక్తిని, వ్యక్తిని కోల్పోయాం. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. అయన ఆశయాలను వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు చిరంజీవి. (Chiranjeevi Condolences To Ramoji Rao)

Read Latest Cinema News

Updated Date - Jun 08 , 2024 | 08:53 PM