Pranaya Godari : పవర్‌ఫుల్‌ పెదకాపు

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:30 AM

హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన సదన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలో పెదకాపుగా ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు సాయికుమార్‌. ఆయన లుక్‌కు సంబందించిన పోస్టర్‌ను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుడు

హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన సదన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలో పెదకాపుగా ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు సాయికుమార్‌. ఆయన లుక్‌కు సంబందించిన పోస్టర్‌ను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విడుదల చేశారు. తమ మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమళ్ల లింగయ్య నిర్మిస్తున్న ‘ప్రణయగోదారి’ విజయం సాధించాలని రాజగోపాల్‌రెడ్డి కోరుకున్నారు. ‘ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్నివర్గాల వారినీ అలరించే అంశాలు చిత్రంలో ఉన్నాయి. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు నిర్మాత పారుమళ్ల లింగయ్య, పి.ఎల్‌.విఘ్నేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Updated Date - Jul 06 , 2024 | 05:30 AM