Pranayagodari: శేఖర్ మాస్టర్ వదిలిన ‘తెల్లారు పొద్దుల్లో’ పాట

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:28 PM

పి.ఎల్. విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలోని ‘తెల్లారుపొద్దుల్లో’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట విశేషమేమిటంటే..

Shekhar Master Movie Thellaru Poddullo Song Launch

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించాయి. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పి.ఎల్. విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయగోదారి’ (Pranayagodari) చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ‌కి సంబంధించి ఇప్పటికే రిలీజైన కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుండి మరో పాటని మేకర్స్ వదిలారు.

Also Read- Love Reddy: రెబల్‌ స్టార్ సపోర్ట్.. యూనిట్ పిచ్చ హ్యాపీ

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ‘ప్రణయ గోదారి’ గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. సినిమాపై క్రేజ్ పెరిగేలా చేశాయి. తాజాగా ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా.. ధనుంజయ్, అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.


Sekhar-Master.jpg

ఈ పాట విడుదల అనంతరం శేఖర్ మాస్టర్ (Shekhar Master) మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి’ మూవీలోని ‘తెల్లారుపొద్దుల్లో’ పాటను ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. దర్శక నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని ఈ పాట చూస్తుంటే అర్థమవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ అని అన్నారు. చిత్రబృందం శేఖర్ మాస్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.

Also Read- The Substance: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

Also Read- Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2024 | 08:28 PM