Jai Hanuman: ‘జై హనుమాన్’ వచ్చేది 2025లో కాదు.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:35 PM

‘హను-మాన్’ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి చిత్రం. రెండో చిత్రం ‘జై హనుమాన్’ పేరుతో 2025 సంక్రాంతికి విడుదల అంటూ.. ‘హనుమాన్’ క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ సినిమా 2025 సంక్రాంతికి రావడం లేదని.. తాజాగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చైతన్య రెడ్డి తెలిపారు. తాజాగా ఆమె నిర్మించిన ‘డార్లింగ్’ విశేషాలను తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారు.

Producer Chaitanya Reddy about Jai Hanuman Release

2024లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచిన వాటిలో తేజ సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ (HanuMan) సినిమా టాప్ స్థానంలో నిలుస్తుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిర్మాతకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి చిత్రం. రెండో చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman) పేరుతో 2025 సంక్రాంతికి విడుదల అంటూ.. ‘హనుమాన్’ క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ సినిమా 2025 సంక్రాంతికి రావడం లేదని.. తాజాగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చైతన్య రెడ్డి (Chaitanya Reddy) తెలిపారు.

Also Read- Kalki 2898AD: దర్శకుడు నాగ్ అశ్విన్ అది ఒప్పేసుకున్నాడు


ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’ (Darling). అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ (‘హను-మాన్’ చిత్ర నిర్మాణ సంస్థ) బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు నిర్మాత చైతన్య రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ‘జై హనుమాన్’ విడుదలకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు.


Jai-Hanuman-Varma.jpg

ఆమె మాట్లాడుతూ.. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి రిలీజ్ మాత్రం పాజిబుల్ అయ్యేలా లేదు. ‘హనుమాన్‌’కి ఈ రేంజ్ రీచ్‌ని ఊహించలేదు. ఒక మార్వల్ లాంటి స్టోరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామనేది మా ఆలోచన. అలాగే ‘జై హనుమాన్’లో ఈ హనుమాన్ ఫ్రాంచైజ్‌లో ఉన్న హీరోలందరినీ పరిచయం చేయాలనేలా ప్లాన్ చేసి.. దానికి తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కాబట్టి.. ‘జై హనుమాన్’ రావడానికి కనీసం 2 సంవత్సరాలైనా పట్టే అవకాశం ఉందనేలా నిర్మాత చైతన్య రెడ్డి చెప్పుకొచ్చారు. (Jai Hanuman Release Update)

Read Latest Cinema News

Updated Date - Jul 06 , 2024 | 05:35 PM