Raashi Khanna: తగ్గేదే లే ! అంటున్న రాశి ఖన్నా

ABN , Publish Date - May 04 , 2024 | 12:57 PM

రాశి ఖన్నా ఫోటో షూట్ లతో అదరగొడుతోంది. తాజాగా నిన్న విడుదలైన తమిళ సినిమా 'అరణ్మనై 4' ప్రచారాలకు చెన్నైలో రాశి ఖన్నా సందడి చేసింది. ఈ సినిమాలో రాశి ఖన్నా ఒక డాక్టరు పాత్ర పోషించింది. అయితే విమర్శకులు ఈ సినిమా గురించి, రాశి ఖన్నా పాత్ర గురించి ఏమంటున్నారు అంటే...

Raashi Khanna: తగ్గేదే లే ! అంటున్న రాశి ఖన్నా
Raashi Khanna

రాశి ఖన్నా నటించిన తమిళ సినిమా 'అరణ్మనై 4' నిన్న విడుదలైంది. ఇదే సినిమా తెలుగులో 'బాక్' అని అనువాదం చేసి విడుదల చేశారు. ప్రముఖ నటి ఖుష్బూ భర్త సుందర్ సి ఈ సినిమాకి దర్శకుడు, ఇందులో కథానాయకుడు కూడా. రాశి ఖన్నా ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనపడుతుంది.

raashikhannaltestupdate.jpg

ఇదే సినిమాలో తమన్నా భాటియా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. అయితే నిన్న విడుదలైన ఈ సినిమాకి విమర్శకుల నుండి అంతగా ప్రశంశలు మాత్రం రావటం లేదు. రాశి ఖన్నా పాత్రకి ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యం లేదు అని రాస్తున్నారు.

raashikhannalatestnews.jpg

ఈ సినిమా కోసమని రాశి ఖన్నా బాగానే ప్రచారాలు చేసింది. తమిళ సినిమాపై ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడే ఎక్కువ ప్రచారాలు చేసిన రాశి ఖన్నాకి ఈ సినిమాపై అంత పెద్దగా విశ్లేషకులు స్పందించినట్టుగా కనిపించటం లేదు. తమిళంలో కూడా ఈ సినిమాకి పెద్దగా రేటింగ్స్ రాలేదనే చెప్పాలి.

raashikhannalatestnewsone.jpg

ఈ సినిమాపై రాశి ఖన్నా చాలా అంచనాలు పెట్టుకుంది, కానీ ఈ సినిమా ఆమెకి విజయాన్ని ఇచ్చేటట్టు కనిపించటం లేదు అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమన్నా పాత్ర బాగుంది అని రాస్తున్నారు.

raashikhannalatestone.jpg

ఇప్పుడు చేతిలో రెండు హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా రాశి ఖన్నాకి వున్నాయి. రాశి ఖన్నా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉంటూ తన తాజా ఫోటోలను అభిమానుల కోసం పెడుతూ ఉంటుంది. నిన్న తన తమిళ సినిమా ప్రచారాల నిమిత్తం చేసిన ఫోటో షూట్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది రాశి ఖన్నా.

Updated Date - May 04 , 2024 | 12:59 PM