Rajinikanth: అమితాబ్ ఓకే చెప్పగానే.. నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:48 PM
ఎప్పుడైతో అమితాబ్ ‘వేట్టైయాన్- ది హంటర్’లో నటించడానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగిందని చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ‘వేట్టైయాన్- ది హంటర్’ చిత్రం దసరా స్పెషల్‌గా అక్టోబర్ 10న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో రజినీకాంత్ మాట్లాడుతూ..
సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’ (Vettaiyan). దసరా స్పెషల్‌గా అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రాన్ని.. కె.ఇ.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడుతూ.. ఎప్పుడైతో అమితాబ్ ఇందులో నటించడానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
Also Read- Manchu Vishnu vs Prakash Raj: పవన్ కళ్యాణ్ పోస్ట్‌పై.. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య వార్
‘‘ఈ ‘వేట్టైయాన్- ది హంటర్’ సినిమా నిర్మాణం చేసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థకి, మంజు వారియర్, రానా దగ్గుబాటి సహా ఇతర నటీనటులకు, సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ధన్యవాదాలు. ‘జైలర్’ మూవీ హిట్ తర్వాత నేను కొన్ని కథలు విని, కొన్నాళ్లకు కథలు పెద్దగా వినటం మానేశాను. ఆ సమయంలో సౌందర్య, డైరెక్టర్ జ్ఞానవేల్‌ను కలిసింది. అప్పటికే నేను ‘జై భీమ్’ సినిమాను చూసి ఉన్నాను. సాధారణంగా మంచి సినిమాలను చూసినప్పుడు సదరు దర్శకులకు ఫోన్ చేసి మాట్లాడటం నాకు అలవాటు. కానీ ఎందుకనో జ్ఞానవేల్‌తో నేను మాట్లాడలేదు. ఆ సమయంలో సౌందర్య నా దగ్గరకు వచ్చి జ్ఞానవేల్ దగ్గర మంచి లైన్ ఉందని, వినమని నాతో చెప్పింది. అప్పుడే నాకు జ్ఞానవేల్ డైరెక్టర్ కావటానికంటే ముందు ఓ జర్నలిస్ట్ అని తెలిసింది. మరోసారి ‘జైభీమ్’ సినిమా చూశాను. ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయని వ్యక్తి, ‘జై భీమ్’ను ఇంత గొప్పగా ఎలా తీశాడా? అని ఆలోచించాను. తర్వాత జ్ఞానవేల్‌తో ఫోన్లో మాట్లాడి కలిశాను.
Also Read- Devara: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కి పండగే!
మీరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. తర్వాత తను చెప్పిన కథ విన్న తర్వాత నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. పది రోజుల సమయం అడిగిన డైరెక్టర్.. రెండు రోజుల్లో మళ్లీ ఫోన్ చేసి నేను లోకేష్ కనగరాజ్, నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను.. నా స్టైల్లో నేను చేస్తానని అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనటంతో ఆయన కథను తయారు చేశారు. తర్వాత సుభాస్కరన్‌ను కలిసి కథ చెప్పగా, ఆయనకు నచ్చింది. లైకా ప్రొడక్షన్స్ అంటే నా సొంత బ్యానర్‌లాంటిది. మీకు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా చేద్దాం సార్ అన్నారు సుభాస్కరన్. మెల్లగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ సినిమాలో యాడ్ అయ్యారు.
ఇక అమితాబ్ పాత్ర గురించి జ్ఞానవేల్ చెప్పి, ఆయనే చేయాలని చెప్పగా, నిర్మాతలతో మాట్లాడమని చెప్పాను. డైరెక్టర్ వెళ్లి సుభాస్కరన్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయన టీమ్‌లో భాగమయ్యారు. ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో నటించడానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు అమితాబ్‌గారు ఎంత పెద్ద నటుడో తెలియదు. నేను ఆయన్ని దగ్గర నుంచి చూశాను. ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రను తనెలా చేస్తాడోనని అనుకున్నాను. తను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈతరంలో తనలాంటి నటుడ్ని నేను చూడలేదు. రామానాయుడుగారి మనవడిగా రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బయటకు నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్టర్‌గా ఆయన మారిపోతారు. తను చాలా మంచి యాక్టర్. ‘బాహుబలి’ సహా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నటుడు. అనిరుద్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నా బిడ్డలాంటోడు. జ్ఞానవేల్ చాలా మంచి వ్యక్తి. తన కోసం ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
Also Read- Tirupati Controversy: లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య
Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే
Read Latest Cinema News