Rana Daggubati: ‘35’ అనగానే నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తొచ్చింది

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:54 PM

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35 చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. తాజాగా టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

35 Chinna Katha Kaadu Teaser Launch Event

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. తాజాగా టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

టీజర్ విషయానికి వస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. యంగ్ ఏజ్‌లోనే విశ్వదేవ్‌ని పెళ్లాడిన నివేదా థామస్‌కి స్కూల్‌కి వెళ్లే అబ్బాయి ఉంటాడు. తను చదువులో పూర్. పాస్ మార్కులు (35) సాధించడంలో విఫలమవడంతో ఫ్యామిలీలో నిరాశకి దారితీసింది. దర్శకుడు నంద కిషోర్ ఈమానీ హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో అందరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. భావోద్వేగాలు చాలా ప్యూర్‌గా వున్నాయి. టీజర్ ప్రామిస్ చేసినట్లుగా, స్కూల్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. (35 Chinna Katha Kaadu Teaser Launched)


35-chinna-Katha-Kaadu-Movie.jpg

ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ.. ‘‘స్కూల్‌లో వున్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటింది (నవ్వుతూ). నందు ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తుకొచ్చింది. ఈ కథ వెళ్లి మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. చాలా మంది లైఫ్ ఇలా వుంటుంది. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు. చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయాలనేది మా ఉద్దేశం. విశ్వ పరేషాన్ సినిమాతో వచ్చారు. సినిమాల పట్ల తనకి చాలా పాషన్ వుంది. నివేదాకి కథ నచ్చేతే ఆ కథతోనే వుంటుంది. ప్రొడక్ట్ అద్భుతంగా రావడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. తను ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా అనందంగా వుంది. దర్శి ఫెంటాస్టిక్ యాక్టర్. ఇందులో తన లుక్ చూసిన వెంటనే మా మ్యాథ్స్ టీజర్ గుర్తుకొచ్చారు. నందు వెరీ వెరీ ప్యూర్ సోల్. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు తను ఇంకెన్నో చేస్తాడు. కిడ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సృజన్ చాలా కాన్ఫిడెంట్‌గా వుంటారు. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 15న ఈ సినిమా రావడం చాలా అనందంగా వుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 09:54 PM