ప్రియుడితో పెళ్లికి సిద్ధం?
ABN , Publish Date - Nov 20 , 2024 | 03:53 AM
ఇటీవలే ‘రఘు తాత’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్. ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్టు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ప్రియుడు, కేరళకు చెందిన వ్యాపారవేత్త....
ఇటీవలే ‘రఘు తాత’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్. ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్టు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ప్రియుడు, కేరళకు చెందిన వ్యాపారవేత్త ఆంటోని తట్టిల్‌తో కీర్తి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారనీ, డిసెంబరు 11న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుందని ఆ వార్తల సారాంశం. పెళ్లికి రెండు రోజుల ముందే డిసెంబరు 9న వివాహ వేడుకలు ఆరంభమవుతాయనీ, ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయని సమాచారం. కీర్తి సురేశ్ 15 ఏళ్లుగా ఆంటోనితో రిలేషన్‌లో ఉన్నారట. స్కూల్ డేస్ నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. అయితే తన పెళ్లి వార్తలపై కీర్తిసురేశ్ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు.