Eeswar: ప్రభాస్ ‘ఈశ్వర్’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా..

ABN , Publish Date - Oct 12 , 2024 | 04:36 PM

పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఇప్పుడీ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. ఈ రీ రిలీజ్ స్పెషల్ ఏంటంటే..

Rebel Star Prabhas in Eeswar

పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘ఈశ్వర్’ (Eeswar 4K) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఇప్పుడీ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రం గ్రాండ్‌గా రీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను సరికొత్తగా కట్ చేసి మేకర్స్ దసరా స్పెషల్‌గా రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈ ‘ఈశ్వర్’ ట్రైలర్ ఇప్పుడందరినీ ఆకట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

‘నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది’ అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్నింటినీ ఈ ట్రైలర్‌లో పొందుపరిచారు. ఈ మూవీని జయంత్ సి పరాన్జీ తెరకెక్కించారు. కె. అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీని లక్ష్మీ నరసింహా మూవీస్ సంస్థ రీ రిలీజ్‌ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా రీ రిలీజ్‌లను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేని కూడా ఈశ్వర్ రీ రిలీజ్‌తో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. (Eeswar 4K Ready to Re Release)

Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ


Eeswar.jpg

ప్రస్తుతం ప్రభాస్‌కి పెరిగిన ఫాలోయింగ్, ఫాలోయర్స్, ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన పాన్ ఇండియన్ ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా ఈశ్వర్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్ మేనియాను డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈశ్వర్ 4kతో సెలెబ్రేట్ చేసుకోబోతోన్నారు. ఈ సినిమా రీ రిలీజ్‌తో పాటు.. ప్రభాస్ బర్త్‌డే చాలా అప్డేట్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఓ నాలుగైదు సినిమాల అప్డేట్స్‌ను మేకర్స్ వదలబోతున్నారని, ఈసారి ప్రభాస్ బర్త్‌డే ట్రీట్ మాములుగా ఉండదనేలా అప్పుడే టాలీవుడ్ టాక్ మొదలైంది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2024 | 04:36 PM