Revind: టైం ట్రావెల్ ఇతివృత్తంతో వస్తున్న 'రివైండ్'

ABN , Publish Date - Oct 15 , 2024 | 06:05 PM

సాయి రోనక్, అమృత చౌదరి  జంటగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి  దర్శక నిర్మాణంలో  వస్తున్న సినిమా 'రివైండ్'.

సాయి రోనక్ (Sai Ronak), అమృత చౌదరి  జంటగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి  దర్శక నిర్మాణంలో  వస్తున్న సినిమా 'రివైండ్' (Revind). ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు.  ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తం ఈ చిత్రాన్ని  ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ " ఫస్ట్ లుక్, టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలోని పాటలు 'సాఫ్ట్వేర్ వద్దురా', 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్',  'లవ్ యు నాన్న' సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. అన్ని పాటలు మిలియన్ వ్యూస్ తో సినిమాపై అంచనాలు పెంచాయి. కొత్త కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా మీద నమ్మకంతో మీడియా షోలు వేయడం జరిగింది. చూసిన డిస్ట్రిబ్యూటర్స్ సినిమా నచ్చి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్ ని ఎపుడు ప్రోత్సహిస్తారు. మా సినిమా ని కూడా అదే విధంగా ప్రోత్సహించి ఆదరిస్తారని, సినిమాకి పెద్ద విజయం చేకూరుస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"  అన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 07:47 PM