Roti Kapda Romance: ‘రోటి కపడా రొమాన్స్‌’ విడుదల ఎప్పుడంటే..

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:08 PM

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. తాజాగా ఈ చిత్ర విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Roti Kapda Romance Movie Still

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapda Romance Movie). హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read- Ram Charan: రామ్ చరణ్ భారీ విరాళం.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘నేటి యువతరంకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర అందరికీ, ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా వుంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. సినిమాను అక్టోబర్ 4న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు. (Roti Kapda Romance Movie Release Date)


Tollywood.jpg

దర్శకుడు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను తీశాం. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. సినిమా సక్సెస్‌పై ఎలాంటి డౌట్‌ లేదు. తప్పకుండా హిట్‌ కొడుతున్నాం. అయితే అది ఏ రేంజ్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో వుంది. ఇదొక ఎమోషన్‌ల్‌ రైడ్‌. లవ్‌, ఎమోషన్‌ వుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ చిత్రంలో వుంటాయి. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది అవుతుంది అని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 04 , 2024 | 07:08 PM

Roti Kapada Romance : యూత్‌ను ఆకట్టుకుంటుంది

Roti Kapda Romance: ఎమోష‌న‌ల్ డోస్ పెంచిన శ్రీవిష్ణు

Roti Kapda Romance: రోటి క‌ప‌డా రొమాన్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Roti Kapda Romance: యూత్‌ని ఆకర్షించేలా ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ లుక్

Roti Kapda Romance: ‘ఓ మై ఫ్రెండ్’ లిరికల్ సాంగ్