Spirit: స్పిరిట్‌లో 'సూపర్ స్టార్' కామియో.. వంగా ఏం ప్లాన్ చేశావ్

ABN , Publish Date - Oct 17 , 2024 | 10:56 AM

సందీప్ ఇప్పటికే పలు బాలీవుడ్ నటులను క్యాస్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా మరో ఇద్దరు క్రేజి స్టార్లను సందీప్ అతిథి పాత్రల్లో చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే థియేటర్లలో రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ క్రేజి స్టార్స్ ఎవరంటే..

‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సందీప్ పెద్ద ప్లానే వేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సలార్, కల్కి 2898AD’ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas)తో ఆయన ‘స్పిరిట్’ (Spirit) అనే మూవీ తీయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ ఇప్పటికే పలు బాలీవుడ్ నటులను క్యాస్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా మరో ఇద్దరు క్రేజి స్టార్లను సందీప్ అతిథి పాత్రల్లో చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే థియేటర్లలో రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ క్రేజి స్టార్స్ ఎవరంటే..


సందీప్ రెడ్డి సినిమాలో కామియో రోల్స్ అయిన జస్ట్ మార్కెట్ కోసం పెట్టాడు. ఆ రోల్స్ ఒక ఇంప్యాక్ట్ సృష్టించే విధంగా ఉంటాయి. అలాంటిది ప్రభాస్ తొలిసారి పోలీస్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు క్రేజి స్టార్స్‌ను బరిలోకి దింపుతున్నట్లు సమాచారం. కెరీర్‌లో ఫస్ట్ సినిమాతోనే విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా మలిచాడు వంగా. ఇక కబీర్ సింగ్‌తో హిందీ ఆడియెన్స్‌కి వైలెన్స్ సరిగ్గా అర్థం కాలేదని 'యానిమల్'తో రణ్‌బీర్ కపూర్‌ని మోస్ట్ వైలెంట్‌గా చూపించాడు. అయితే ఈ ఇద్దరినీ ప్రభాస్ 'స్పిరిట్' కోసం రంగంలోకి దించనున్నాడట సందీప్. ఈ కాంబో కానీ రిపీట్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. విజయ్ దేవరకొండకి కొన్ని ప్లాప్స్ తర్వాత తెలుగులో కాస్త క్రేజ్ తగ్గినట్లు కనిపిస్తున్న.. హిందీలో మాత్రం కొంచం కూడా తగ్గలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్‌ని సందీప్ ఎలా చూపెట్టబోతున్నాడని ఫ్యాన్స్‌తో సహా సినీ సర్కిల్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Oct 17 , 2024 | 10:56 AM