Sanjay Dutt: ‘డబుల్ ఇస్మార్ట్’గా రామ్ మస్త్ ఉంటాడు..

ABN , Publish Date - Aug 08 , 2024 | 10:26 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుతం టీమ్ అంతా ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుంచి ‘బిగ్ బుల్’ సాంగ్‌ని ముంబైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Double ismart Big Bull Song Launch Event

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni), డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుతం టీమ్ అంతా ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ ఫుల్ రోల్ పోషించగా.. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. గురువారం ముంబై‌లో ఈ సినిమాకు సంబంధించి ‘బిగ్ బుల్’ అనే స్పెషల్ సాంగ్‌ను లాంచ్ చేశారు మేకర్స్. పూరి జగన్నాధ్ తన విలన్‌లను పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌‌తో ప్రెజెంట్ చేయడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన ‘డబుల్ ఇస్మార్ట్‌’లో మెయిన్ విలన్‌పై ఒక పాటను ఇంక్లూడ్ చేశారు. ఇందులో ‘బిగ్ బుల్’ క్యారెక్టర్‌ని సంజయ్ దత్ పోషించారు. (Big Bull Song Launched From Double Ismart)

Also Read- Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్

స్వరబ్రహ్మ మణి శర్మ కంపోజ్ చేసిన ఈ ‘బిగ్ బుల్’ సాంగ్ విజువల్‌గా, మ్యూజికల్‌గా పవర్ ఫుల్‌గా ఉంది. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ అయిన ఈ పాటలో కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేయగా.. ఈ పాటలో సినిమాలోని కీలక పాత్రలన్నీ కనిపించడం విశేషం. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చంద్ర, సంజన కల్మంజే ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.


Sanjay-Dutt.jpg

ముంబైలో బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ (Sanjay Dutt) మాట్లాడుతూ.. తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసి, బిగ్ బుల్‌గా ప్రజెంట్ చేస్తున్న పూరికి థాంక్ యూ. ఛార్మి పరేషాన్ చేసింది.. తన హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్ వలనే ప్రొడక్ట్ ఇంత అద్భుతంగా వచ్చింది. కావ్య ఇందులో చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది. విషు‌కి థాంక్యూ. రామ్ నా యంగర్ బ్రదర్ లాంటివాడు. తనతో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’గా మస్త్ ఉంటాడు. తనతో వర్క్ చేయడం ప్లెజర్ అండ్ హానర్. తను గుడ్ పెర్ఫార్మర్. వెరీ హార్డ్ వర్కర్. తన ఫన్‌తో ఈ సినిమా చేశాం. చాలా చోట్ల తిరిగాం. చాలా మస్తీ చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

‘డబుల్ ఇస్మార్ట్‌’ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మించారు. సామ్ కె నాయుడు, జియాని జియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read Latest Cinema News

Updated Date - Aug 08 , 2024 | 10:26 PM

Double ISmart : మాస్‌ మూమెంట్స్‌తో ‘స్టెప్పామార్‌’

Double Ismart: మార్ ముంత చోడ్ చింత వచ్చేస్తోంది.. రచ్చ రచ్చే!

Double ISMART: న‌రం న‌రం గ‌రం గ‌రం.. చ‌లి జ్వ‌రం ‘క్యా లఫ్డా’! అదిరిపోయిన‘డబుల్ ఇస్మార్ట్’ మూడో సింగిల్

Double ISMART: రామ్‌, పూరి ‘డబుల్ ఇస్మార్ట్’.. ‘క్యా లఫ్డా’ లిరిక‌ల్ సాంగ్ మీకోసం

Double ismart Trailer: ఇప్పుడు పడింది అసలైన బొమ్మ.. దిమాక్ ఖరాబ్!