లైంగికంగా వేధించాడు

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:37 AM

జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై బెంగళూరులో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ హోటల్లో రంజిత్‌ తనను లైంగికంగా వేధించాడంటూ...

  • మలయాళ దర్శకుడు రంజిత్‌పై నటుడి ఫిర్యాదు

జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై బెంగళూరులో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ హోటల్లో రంజిత్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువ నటుడు పోలీసులకు ఫిర్యాదు చే శాడు. ‘2012లో బెంగళూరులో మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో రంజిత్‌ను కలిశాను. సినిమాలో అవకాశం ఇస్తానని హోటల్‌కు పిలిపించి, అక్కడ ఆడిషన్‌ పేరుతో దుస్తులు విప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు’ అని నటుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా బెంగాలి నటి శ్రీలేఖ మిత్రా ఫిర్యాదు మేరకు రంజిత్‌ లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 08:38 AM