Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?
ABN , Publish Date - Feb 14 , 2024 | 08:32 PM
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడైన సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ చిత్ర గ్లింప్స్‌ని హరీష్ శంకర్, రామ్ విడుదల చేయగా.. సుకుమార్ యూనిట్‌కు ఇన్‌స్టా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). నటుడు ధనరాజ్ (Dhanaraj) మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడైన సముద్రఖని (Samuthirakhani) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ చిత్ర గ్లింప్స్‌ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఈ గ్లింప్స్‌ను విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ధనరాజ్ దర్శకుడిగా మారుతున్న సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆయనను అభినందించారు.
గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో హరీష్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ.. ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ‘రామం రాఘవం’ సినిమాను తీశారు. గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎమోషనల్ జర్నీతో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజున తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్‌ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లింప్స్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు టీమ్ అని అన్నారు. (Ramam Raghavam Touching Glimpse Out)
సుకుమార్ (Sukumar) ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘బలగం’ సినిమాతో వేణు, ఈ సినిమాతో ధనరాజ్ డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నాడు. చూస్తుంటే ‘జగడం’ గ్యాంగ్ మొత్తం డైరెక్షన్ వైపు వచ్చేలా కనిపిస్తున్నారు. ‘రామం రాఘవం’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా.. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..
*************************
*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..
***************************
*Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన
**********************