Sunday Girlfriend: నేటి ట్రెండ్‌ లవ్‌ స్టోరీతో..

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:32 PM

కామ్నా శర్మ, సుమన్‌, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సండే గర్ల్‌ ఫ్రెండ్‌’. లార్విన్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.


కామ్నా శర్మ, సుమన్‌, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సండే గర్ల్‌ ఫ్రెండ్‌’. లార్విన్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. లవ్‌ అండ్‌ మ్యూజికల్‌ ఎంటర్‌ టైనర్‌ కథతో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్‌తో పాటు  లిరిక్స్‌ కూడా అందిస్తుండటం విశేషం. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది.  పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్‌ నివ్వగా, సుమన్‌ స్ర్కిప్ట్‌ అందజేశారు. ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

దర్శకుడు గడ్డం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ "నేను ప్రస్తుతం 'సీఎం పెళ్లాం’ అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఆ సినిమా రాజకీయ నేపథ్యంతో  మెసేజ్  ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తదుపరి చిత్రాన్ని అదే జానర్‌లో కాకుండా పూర్తిగా నేటి ట్రెండ్‌ లవ్‌ స్టోరీతో చేస్తున్నాను. లవ్‌ అండ్‌ మ్యూజికల్‌ ఎంటర్‌ టైనర్‌గా ఆకట్టుకుంటుంది. పాటల రికార్డింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని అన్నారు.

హీరోయిన్‌ కామ్నా శర్మ మాట్లాడుతూ ుూ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 05:36 PM