Kannappa: ‘కన్నప్ప’ మహాదేవ శాస్త్రి లుక్ వచ్చేసింది..
ABN , Publish Date - Nov 22 , 2024 | 04:55 PM
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈసారి మేకర్స్ ఓ పవర్ ఫుల్ లుక్‌ని వదిలారు. ఇందులో మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మోహన్ బాబు 50 ఏళ్ల నట ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా.. మేకర్స్ ‘కన్నప్ప’లోని ఆయన లుక్‌ని రివీల్ చేశారు. ఆయన లుక్ ఎలా ఉందంటే..
విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా డా. మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ దిగ్గజం మోహన్ బాబు 50 ఏళ్ల నట ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ‘కన్నప్ప’ మూవీ నుంచి ఆయన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read-Posani Krishna Murali: వర్మ, మాకేంటి ఈ కర్మ.. అర్థమైందా రాజా
‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్‌లో.. మహాదేవ శాస్త్రి (Mahadeva Shastri)గా మోహన్ బాబు గంభీరమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్, టీజర్ మూవీపై అంచనాలు పెంచగా, తాజాగా వదిలిన మోహన్ బాబు పోస్టర్ బజ్ క్రియేట్ చేస్తోంది. సినిమాలో ఈ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అనే క్యూరియాసిటీని ఈ లుక్ నెలకొల్పింది.
‘కన్నప్ప’ ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని, భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించబోతున్నామని ఇప్పటికే మోహన్ బాబు చెప్పడం.. అందుకు తగ్గట్టుగా కొత్త పోస్టర్స్ వదులుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇలా వచ్చిన ప్రతి పోస్టర్ సినిమాపై క్రేజ్‌కు కారణంగా నిలుస్తోంది. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం అని మోహన్ బాబు అన్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు తనయుడు అవ్రామ్ సినీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ‘కన్నప్ప’ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ మైలురాయి నిలిచిపోతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.