పది ప్రేమ కథలు
ABN , Publish Date - Oct 30 , 2024 | 05:41 AM
దర్శకుడు, రచయిత మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ‘యో 10 ప్రేమ కథలు’ టైటిల్‌తో కొత్త సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పి.సి.క్రియేషన్స్ సమర్పణలో...
దర్శకుడు, రచయిత మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ‘యో 10 ప్రేమ కథలు’ టైటిల్‌తో కొత్త సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పి.సి.క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ నిర్మిస్తోంది. పది మంది పాపులర్ హీరో, హీరోయిన్స్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ‘ యో..అనే మాట యువతకు ప్రతీక. ఈతరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన 10 ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. ఒక్కో ప్రేమ కథ ఒక్కో జానర్లో ఉంటుంది. అయితే ఈ ప్రేమ కథలన్నింటికీ లక్ష్యం ఒక్కటే ఉంటుంది’ అని తెలిపారు.