అందుకే హిందీలో మాట్లాడను

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:19 AM

‘నేను హిందీలో మాట్లాడగలను కానీ ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అందుకే వేదికలపై హిందీలో మాట్లాడను’ అని చెప్పారు సమంత. అసలు విషయం ఏమిటంటే ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ.. బన్నీ’ సిరీస్‌...

‘నేను హిందీలో మాట్లాడగలను కానీ ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అందుకే వేదికలపై హిందీలో మాట్లాడను’ అని చెప్పారు సమంత. అసలు విషయం ఏమిటంటే ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ.. బన్నీ’ సిరీస్‌ దర్శకులు రాజ్‌, డీకే ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిరీస్‌లో కథానాయిక మొదట సమంతను అనుకోలేదని చెప్పారు. ‘మేం రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ నిర్మాణ సమయంలోనే ‘సిటాడెల్‌’ స్ర్కిప్ట్‌ దశలో ఉంది. అయినా ఈ విషయం సమంతకు చెప్పలేదు. ఎందుకంటే హీరోయిన్‌గా హిందీ బాగా మాట్లాడగలిగే వ్యక్తి ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ షూటింగ్‌లో సమంత హిందీలో మాట్లాడక పోవడంతో ఆమెకు రాదేమో అనుకుని మరో హీరోయిన్‌ ని తీసుకోవాలని అనుకున్నాం. కానీ సమంత ఓ రోజు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడడంతో ఆశ్చర్యపోయి ఆమెని ఎంపిక చేశాం’ అని చెప్పారు. అప్పుడు సమంత అలా కామెంట్‌ చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 02:19 AM