వేణుమాధవ్ లేని లోటు తీర్చే కమెడియన్.. టాలీవుడ్ సరిగా వాడుకోవడం లేదబ్బా!

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:44 PM

బ్రహ్మనందంతో పాటు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కమెడియన్లలో వేణుమాధవ్ కూడా ఒకరు. తనదైన తరహా కామెడీతో ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా వెలుగొందిన వేణుమాధవ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ అడుగుపెట్టారు కానీ.. ఎవరూ ఆయనని మ్యాచ్ చేయలేకపోయారు. వేణుమాధవ్‌ని దాదాపు రీచ్ అయ్యే స్టేజ్ ఉన్న ఈ కమెడియన్‌ని మాత్రం టాలీవుడ్ సరిగా వినియోగించుకోవడం లేదు.. ఎవరా కమెడియన్ అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి.

Venu Madhav

బ్రహ్మనందంతో పాటు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కమెడియన్లలో వేణుమాధవ్ కూడా ఒకరు. తనదైన తరహా కామెడీతో ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా వెలుగొందిన వేణుమాధవ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ అడుగుపెట్టారు కానీ.. ఎవరూ ఆయనని మ్యాచ్ చేయలేకపోయారు. ఇక దాదాపు అయనని రీచ్ చేసే స్థాయిలోనూ, ఆకారంలోనూ ఆయనలానే ఉన్న ఏకైక కమెడియన్ అంటే కచ్చితంగా రచ్చ రవే అని చెప్పొచ్చు. వేణుమాధవ్ లాంటి హైట్, ఫిజిక్ రచ్చ రవి సొంతం. ఆయనలానే ఒక్క కమెడియన్‌గానే కాకుండా హీరో ఫ్రెండ్‌గా, పొలిటికల్ లీడర్‌గా, కమెడియన్‌గా ఇలా వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ.. తనదైన నటనను ప్రదర్శిస్తున్నాడు రచ్చ రవి. అయితే టాలీవుడ్ ఈ కమెడియన్‌ని సరిగా వాడుకోవడం లేదనిపిస్తుంది.

Racha-ravi.jpg


ఇప్పటి వరకు దాదాపు 150 సినిమాలలో నటించిన రచ్చ రవిని.. ఇంకా జబర్దస్త్ కమెడియన్‌గానే (జబర్దస్త్ వదిలి దాదాపు 10 ఏళ్లు అవుతున్నా) చూస్తున్నారు కానీ.. సరైన గుర్తింపును మాత్రం ఇండస్ట్రీ ఇవ్వలేదనిపిస్తుంది. తనకు వచ్చే పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్న రచ్చ రవి.. భోళా మనిషిగా ఇండస్ట్రీలోని అందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ, ఆయనని పూర్తి స్థాయి కమెడియన్‌గా మాత్రం ఏ దర్శకుడు వాడుకోకపోవడం విడ్డూరమనే చెప్పాలి. ఒకటి రెండు సీన్లకే ఆయనని పరిమితం చేస్తూ.. ఆయనలోని కమెడియన్‌ని, కామెడీనీ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.

Brahmanandam.jpg

ప్రస్తుతం బ్రహ్మానందం కూడా నటన తగ్గించారు. ఇక ఇప్పుడు ఫామ్‌లో ఉంది వెన్నెల కిశోర్, సత్య మాత్రమే. బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ లాంటి వారి మధ్య వేణుమాధవ్‌ లాంటి వారికి కూడా అప్పట్లో మంచి స్పేస్ ఉండేది. కానీ ఇప్పుడు ఒకటే రొటీన్‌గా వారినే తిప్పి తిప్పి మన దర్శకులు చూపిస్తున్నారు తప్పిదే.. రచ్చ రవి లాంటి వారికి పెద్దగా అవకాశం అయితే కల్పించడం లేదనే చెప్పుకోవాలి.

KRR.jpg


రచ్చ రవికి ఉన్న మరో టాలెంట్ మిమిక్రీ. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో సైతం అవకాశాలు పొందుతున్నాడంటే.. దీని వెనుక ఆయన ఎంత శ్రమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తే అయినా.. అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ యాసలను కూడా పర్ఫెక్ట్‌గా దించగల సామర్థ్యం రచ్చ రవికి ఉంది. అది ఎన్నో సినిమాలలో నిరూపితమైంది కూడా. 2024 సైమా అవార్డ్స్‌లో బెస్ట్ కమెడియన్‌గా, 2024 ఐఫా అవార్డ్స్‌గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టుగా నామినేట్ అయ్యాడు. కానీ అవార్డు మాత్రం వరించలేదు.

Kota.jpg


Udayabhanu.jpg

‘వాల్తేరు వీరయ్య’, ‘బలగం’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో పాటు ‘కిస్మత్, భీమా, ఓం భీమ్ బుష్, పురుషోత్తముడు, భలే ఉన్నాడే, లగ్గం, ఉత్సవం’ ఇలా వరస సినిమాలలో నటిస్తున్నా.. స్టార్ కమెడియన్‌గా మాత్రం కాలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో శంకర్-రామ్ చరణ్‌ల ‘గేమ్ చేంజర్’, గోపీచంద్ మలినేని- సన్నీడియోల్ ల ‘జాట్’ వంటి దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతోనైనా రచ్చ రవికి స్టార్ కమెడియన్ స్టేటస్ వస్తుందేమో చూద్దాం.

Viswanath.jpg


Also Read-Nivetha Pethuraj: బాలుడి చేతిలో మోసపోయా

Also Read-Suriya - NBK: సింగం, సమరసింహం ఒకే స్టేజ్‌పై.. ‘ఐ లవ్ యు’

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Racha-Ravi-1.jpg

Updated Date - Nov 06 , 2024 | 12:23 AM