Turning Point: ఒక హీరోకి, ముగ్గురు హీరోయిన్లకి ‘టర్నింగ్ పాయింగ్’ అవుతుందా
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:01 PM
ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ‘టర్నింగ్ పాయింట్’ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ మనిషిని పట్టుకోవడం ఎవరితరం కాదు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమే ‘టర్నింగ్ పాయింట్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా.. హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్లుగా స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మిస్తున్న చిత్రం ‘టర్నింగ్ పాయింట్’ (Turning Point). ఈ చిత్రానికి కుహన్ నాయుడు (Kuhan Naidu) దర్శకుడు. గురువారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెన్సేషనల్ మాస్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (Turning Point Movie First Look Launched)
Also Read- Kanguva: సూర్యకి తీరని అన్యాయం.. హైదరాబాద్‌లో ఒక్కటే స్క్రీన్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సురేష్ దత్తి మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌కు సస్సెన్స్‌తో పాటు మాస్ అంశాలను జోడించి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మా చిత్ర ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ విడుదల చేయడం ఎంతో సంతోషంగా వుంది. వాళ్లు అందించిన సపోర్ట్ మరువలేనిది. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ‘టర్నింగ్ పాయింట్’ చిత్రం మా టీమ్ అందరి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రంలో అలరించే అంశాలు చాలా వున్నాయని తెలిపారు.
దర్శకుడు కుహన్ నాయుడు మాట్లాడుతూ.. మాస్ సెన్సేషనల్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు విజయ్ కనకమేడల మా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి ఈ సందర్బంగా మా టీమ్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌రి బాగా ఎంగేజ్ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తామని అన్నారు. ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా ‘గరుడ వేగ’ అంజి.