Mr Celebrity: ‘మిస్టర్ సెలెబ్రిటీ’ గజానన పాట.. వరలక్ష్మీ విశ్వరూపం

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:57 PM

సుదర్శన్ పరుచూరి హీరోగా వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ సినిమాలోని ‘గజానన’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ పాటలో ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

Mr Celebrity Movie Still

సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri) హీరోగా వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity). ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా వినాయక చవితి స్పెషల్‌గా ఓ హుషారైన భక్తి గీతాన్ని మేకర్స్ వదిలారు.

Also Read- Tollywood: సాయి ధరమ్, వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..

ప్రస్తుతం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్ని చోట్ల గణేష్ మండపాలు రెడీ అవుతున్నాయి. ఈ మండపాలలో మైక్ సెట్స్‌లో మోత మోగే పాటలా.. ‘గజానన’ (Gajanana Song) అంటూ సాగే ఈ పాటని మేకర్స్ రెడీ చేశారు. ఆ వినాయకుడి నామస్మరణే వినిపించేలా ‘గజానన’ అంటూ సాగిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ యాజమాన్య ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగిపోవడం పక్కా అని చెప్పొచ్చు.


vaaralu.jpg

ముఖ్యంగా ఈ ‘గజానన’ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వరలక్ష్మీ కొన్ని కీలక పాత్రలలో మాత్రమే కనిపిస్తోంది. సీరియస్ రోల్స్‌లో నటిస్తోంది. కానీ, చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది. తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.

Read Latest Cinema News

Updated Date - Sep 05 , 2024 | 05:57 PM