Yevam: ‘యేవమ్’‌లో యుగంధర్‌గా వశిష్ట ఎన్ సింహ.. లుక్ అదిరింది

ABN , Publish Date - May 19 , 2024 | 11:55 AM

‘యేవమ్’‌ సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న ఒక్కో లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. రీసెంట్‌గా వదిలిన చాందిని చౌదరి, అసు రెడ్డి, భరత్ క్యారెక్టర్ పోస్టర్‌లు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా కన్నడ రాయల్ స్టార్ వశిష్ట ఎన్ సింహను ‘యుగంధర్’‌గా పరిచయం చేస్తూ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Yevam: ‘యేవమ్’‌లో యుగంధర్‌గా వశిష్ట ఎన్ సింహ.. లుక్ అదిరింది
Vasishta N Simha in Yevam Movie

‘యేవమ్’‌ (Yevam Movie) సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న ఒక్కో లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. రీసెంట్‌గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్‌తో చాందినీ చౌదరి (Chandini Chowdary) క్యారక్టర్ పోస్టర్‌ను, హాట్ లుక్‌లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ అషు రెడ్డి (Ashu Reddy) పోస్టర్‌ను అలానే పోలీస్ ఆఫీసర్‌గా యాక్టర్ భరత్‌ (Bharath)తో ‘ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కో ఇన్సిడెన్సేస్’ అని పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మరో వైవిధ్యమైన క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు.

*Kalki 2898AD Bujji: భైరవుడి ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. అరుపులే!

కన్నడ రాయల్ స్టార్ వశిష్ట ఎన్ సింహ (Vasishta N Simha)ను ‘యుగంధర్’‌ (Yugandhar)గా పరిచయం చేస్తూ విడుదల చేసిన లుక్ వైరల్ అవుతోంది. ఇందులో పంచ కట్టులో చేతిలో ఢమరుకం పట్టుకుని.. ‘ఏం? నేను సరిపోనా?’ అనే హుక్ లైన్‌తో పవర్‌ఫుల్‌గా పోస్టర్ డిజైన్ చేశారు. యుగంధర్ లుక్ చూస్తుంటే తెలుగులో ఇప్పటి వరకు వశిష్ట ఎన్ సింహ చేసిన అన్ని క్యారెక్టర్‌లతో పోలిస్తే ఈ లుక్ చాలా యునిక్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. (Vasishta N Simha Look From Yevam Out)


Yevam.jpg

పిడిపి, సి స్పేస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నవదీప్ (Navdeep), పవన్ గోపరాజు (Pavan Goparaju) నిర్మాతలు. ప్రకాష్ దంతులూరి (Prakash Dantuluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వైపు హీరోగా చేస్తూ కూడా మరో వైపు నవదీప్ ఇలా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం చూస్తుంటే ఈ ‘యేవమ్’ కథలో ఉన్న పొటెన్షియాలిటీ ఏంటనేది ఇట్టే అర్థమవుతోంది.

Read Latest Cinema News

Updated Date - May 19 , 2024 | 11:55 AM