Veekshanam: వెంకటేష్ చెప్పిన ఆ ఒక్క మాటతో.

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:35 AM

వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చేసుకోవడం అన్నారు. వెంకటేష్ గారు చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్ కు మూలం

రామ్ కార్తీక్(Ram Karthik), క‌శ్వి (Kaswi)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'వీక్షణం' (Veekshanam).  ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి (Manoj Palleti) రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఏర్పాటు  చేసిన సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 


దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ  "రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డీఎఫ్ టీ కోర్స్ చేస్తున్న సమయంలో  వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చేసుకోవడం అన్నారు. వెంకటేష్ గారు చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్ కు మూలం. అక్కడి నుంచి వీక్షణం సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ వచ్చాం.  సంతోషంగా లైఫ్ లీడ్ సాగిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది అనేది మా మూవీ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగుందని అనడం నా కాన్ఫిడెన్స్ పెంచింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్స్ నా కథ బాగుందని అంటున్నారంటే ఇందులో కంటెంట్ ఉంది అనిపించింది.  కామెడీ మిస్టిక్ థ్రిల్లర్ తరహాలో వీక్షణం సినిమా సాగుతుంది.  థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం మా సినిమా ప్రత్యేకత.  ఈ కథలో రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. అయితే వాటికి ఫిక్షన్ జోడించి సినిమాను రూపొందించాను. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు.థ్రిల్లర్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్స్. వీక్షణం లాంటి సినిమాలను భాషలకు అతీతంగా ఎవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మనం ఓటీటీలో ఏ భాషలో సినిమా అయినా చూసి ఆనందిస్తాం. కంటెంట్ బాగుండాలి..అదొక్కటే ముఖ్యం. ఆ కంటెంట్ మా వీక్షణం మూవీలో ఉంది.త్వరలో నా నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తాం" అన్నారు.


సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ "7 డేస్, 6 నైట్స్ అనే మూవీకి మ్యూజిక్ చేశాను. వీక్షణం సంగీత దర్శకుడిగా నాకు రెండో సినిమా. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, లవ్, రొమాన్స్ వంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి కథకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి సిధ్ శ్రీరామ్ పాడారు.   దర్శకుడు కథ చెప్పగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది.   వీక్షణం మూవీకి రెహమాన్ గారు లిరిక్స్ రాశారు. నేను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:35 AM