Maharaja: రూ. 100 కోట్ల దిశగా విజయ్ సేతుపతి ‘మహారాజ’.. బడ్జెట్ ఎంతో తెలుసా?

ABN , Publish Date - Jun 27 , 2024 | 08:47 PM

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘మహారాజ’. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం 10 రోజులకుగానూ రూ. 81.8 కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Maharaja: రూ. 100 కోట్ల దిశగా విజయ్ సేతుపతి ‘మహారాజ’.. బడ్జెట్ ఎంతో తెలుసా?
Maharaja Movie Still

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘మహారాజ’ (Maharaja). నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్‌గా రిలీజ్ చేసింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి విమర్శకులు ప్రసంశలు అందుకొని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుని.. సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం 10 రోజులకుగానూ రూ. 81.8 కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. (Maharaja Movie Collections)

Also Read- Kalki 2898AD Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక నటించిన సినిమా ఎలా ఉందంటే...


Vijay-Sethupathi.jpg

‘కురంగు బొమ్మై’ చిత్రం ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నితిలన్‌ స్వామినాథన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, అలాగే విజయ్‌ సేతుపతి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో అనురాగ్‌ కశ్యప్‌ ఓ కీలక పాత్ర పోషించగా.. నట్టి కుమార్‌, సింగం పులి, మమతా మోహన్‌దాస్, అభిరామి, మునీష్ కాంత్‌, వినోద్‌ సాగర్‌ ఇతర పాత్రలను పోషించారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ. 81 కోట్లకు పైగా వసూలు చేసి.. రూ. 100 కోట్ల వసూళ్ళ దిశగా దూసుకెళుతోన్న సందర్భంగా.. మేకర్స్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Latest Cinema News

Updated Date - Jun 27 , 2024 | 08:47 PM