Hema: వైరల్‌ ఫీవర్‌... రాలేను

ABN , Publish Date - May 28 , 2024 | 03:42 AM

బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు...

Hema: వైరల్‌ ఫీవర్‌... రాలేను

బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ నటి హేమ ఈ విచారణకు హాజరుకాలేనని.. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానని తెలిపారు. విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని కోరారు.


ఇదిలా ఉంటే హేమ సోమవారం ఉదయం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ‘‘మనం తప్పుచేయనంత వరకూ ఏ విషయంలో అస్సలు భయపడాల్సిన పనిలేదు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోవడానికి మనమేం దేవుళ్లం కాదు కదా. ఒకవేళ.. తప్పు జరిగినా ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెపితే సరిపోతుంది. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం. ఏ విషయంలోనైనా అబద్ధాలు చెప్పకపోతేనే మంచిది. ఒక అబద్ధం చెబితే.. దానిని కవర్‌ చేయడానికి మరో వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నేను అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడను. అందుకే నేను ఆనందంగా ఉన్నాను’’ అని లైవ్‌ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - May 28 , 2024 | 09:11 AM