Vishva Karthikeya: విశ్వ కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Oct 12 , 2024 | 10:38 PM

యంగ్ హీరో విశ్వ కార్తికేయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలను చేస్తూ.. ప్రేక్షకులలో గుర్తింపును పొందుతోన్న విషయం తెలిసిందే. ‘కలియుగం పట్ణణంలో’ సినిమాతో నటుడిగా ఆయన మరో మెట్టు ఎక్కారు. ఇప్పుడు దసరా స్పెషల్‌గా విశ్వ కార్తికేయ హీరోగా నూతన చిత్రం ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Vishva Karthikeya 7 Movie Opening Pic

యంగ్ హీరో విశ్వ కార్తికేయ (Vishva Karthikeya) నటుడిగా వైవిధ్యమైన పాత్రలను చేస్తూ.. ప్రేక్షకులలో గుర్తింపును పొందుతోన్న విషయం తెలిసిందే. ‘కలియుగం పట్ణణంలో’ సినిమాతో నటుడిగా ఆయన మరో మెట్టు ఎక్కారు. ఇప్పుడు దసరా స్పెషల్‌గా విశ్వ కార్తికేయ హీరోగా నూతన చిత్రం ప్రారంభమైంది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం శనివారం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో మొదలైంది. అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై విశ్వ కార్తికేయ ఏడో చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది.

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?

విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ నటించనుంది. ముహూర్తం సన్నివేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సుమన్ క్లాప్ కొట్టారు. సీనియర్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ చంద్ర మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సీనియర్ దర్శకులు సముద్ర, సి.ఎల్. శ్రీనివాస్, కోటిబాబు స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.


Movie-Opening.jpg

ఈ చిత్రానికి పోలాకి విజయ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. యెలేందర్ మహావీర్ సంగీతాన్ని అందించనుండగా.. కిషోర్ బోయిడపు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. తారక్ (ఎన్టీఆర్) ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రమిది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2024 | 10:38 PM