Gangs of Godavari: అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్ది అంతే..
ABN , Publish Date - Apr 27 , 2024 | 09:06 PM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న మరో విభిన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో ఆయన లంకల రత్న అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) హీరోగా నటిస్తోన్న మరో విభిన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). ఇందులో ఆయన లంకల రత్న అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
ముందుగా టీజర్ విషయానికి వస్తే.. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా ఆహార్యం మార్చుకునే అలవాటున్న విశ్వక్ సేన్, ‘లంకల రత్న’ (Lankala Rathna) పాత్ర కోసం తనని తాను మలుచుకున్న తీరు ఆకర్షిస్తోంది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరమీద కనిపిస్తోంది. తాను ఇప్పటివరకు పోషించిన పాత్రలను మైమరపింప చేసేలా ఈ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయారు. టీజర్‌లోని ప్రతి షాట్ ‘లంకల రత్న’ పాత్ర తీరుని ప్రతిబింబించేలా ఉంది. లైటింగ్, నీడలు, చీకటి, హీరో బాడీ లాంగ్వేజ్ ద్వారా ‘లంకల రత్న’ పాత్రని తెలియజేసేలా టీజర్‌ని కట్ చేశారు. ‘లంకల రత్న’ పాత్ర, ఆయనుండే ప్రాంతానికి చెందిన సంభాషణలు.. ఈ చిత్రం యొక్క చీకటి ప్రపంచాన్ని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడటంపై విశ్వక్ సేన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ‘అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్ది అంతే’, ‘నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు.. కానీ మంచోడిని అన్న చెడ్డ పేరొద్దు’ వంటి సంభాషణలు విశ్వక్ సేన్ పోషించిన పాత్ర తీరుతో పాటు, యాసపై ఆయనకున్న పట్టుని తెలియజేస్తున్నాయి. సొంత మనుషుల నుంచే అవరోధాలను ఎదుర్కొంటూ, చీకటి సామ్రాజ్యంలో ఒక సాధారణ వ్యక్తి, అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనేది ఈ చిత్రంలో చెప్పబోతున్నారనేది ఈ టీజర్‌తో తెలుస్తోంది. చిత్ర కథను, హీరో పాత్రను టీజర్‌లో చాలా బాగా చూపించారు. దర్శకుడు కృష్ణ చైతన్య రచన, అనిత్ మధాడి కెమెరా పనితనం, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం అన్నీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Gangs of Godavari Teaser Talk)
టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా టీమ్ అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాం. ఏడాదిలో సినిమాని పూర్తి చేసి, అద్భుతమైన అవుట్ పుట్‌తో మీ ముందుకు వస్తున్నాం. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టీజర్‌లో మీరు చూసింది ఒక్క శాతమే. సినిమా మీ అంచనాలకు మించేలా ఉంటుంది. ఇది నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా.. అందుకేనేమో భయంతో పెద్దగా మాటలు రావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమా తర్వాత.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి తరువాత అనేలా నా కెరీర్ ఉంటుంది. ఇంత మంచి సినిమాని నాతో చేసిన నిర్మాత నాగ వంశీ కృతజ్ఞతలు. అలాగే వెంకట్, గోపీచంద్ చిత్రీకరణ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కృష్ణ చైతన్య గురించి సినిమా విడుదలకు మాట్లాడతాను. అందమైన కథానాయికలు నేహా శెట్టి, అంజలితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తాను.. ఈసారి శివాలెత్తిపోద్ది. అలాగే మన పేరుకి న్యాయం చేసే సమయం వచ్చింది. అదే ఈ సినిమా. మే 17న థియేటర్లలో కలుద్దామని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. ఇది చాలా రోజుల తర్వాత విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా. ఈ మూవీ ఏ రేంజ్‌కి వెళ్తుంది అనేది మొదటి షోకి తెలిసిపోతుంది. ఈ ఎన్నికల హడావుడి ముగిశాక ట్రైలర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్ జోరు పెంచుతాం. టిల్లు స్క్వేర్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాని తెలపగా.. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుందని హామీ ఇస్తున్నాను. విశ్వక్ విశ్వరూపం చూస్తారు. నేహా శెట్టి (Neha Sshetty), అంజలి (Anjali) పాత్రలు కూడా చాలా బాగుంటాయని అన్నారు. ఇంకా నేహా శెట్టి, అంజలి మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
Read Latest Cinema News