Vishwak Sen: నా సినిమాను యూఎస్ షో కంటే ముందే చూసుకోండి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 07:12 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. నవంబర్ 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ 1.0ను మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అభిమానులు సమక్షంలో విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ ఏమని చెప్పారంటే..

Mechanic Rocky Trailer Launch Event

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). ఈ మూవీ ఫస్ట్ గేర్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రవితేజ ముళ్లపూడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఆదివారం ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Also Read- Love Reddy: రెబల్‌ స్టార్ సపోర్ట్.. యూనిట్ పిచ్చ హ్యాపీ


ట్రైలర్ విషయానికి వస్తే.. (Mechanic Rocky Trailer Talk) ట్రైలర్‌‌ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమా యాక్షన్‌ ప్యాక్డ్ హ్యుమరస్‌గా వుంటుందని ప్రామిస్ చేస్తోంది. రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్‌ని టేకోవర్ చేసుకొని, లేడీస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తాడు. హీరోయిన్స్ పాత్రలు పోషించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లని ఫ్లర్ట్ చేస్తాడు. పవర్ ఫుల్ మ్యాన్ సునీల్‌తో తలపడటం క్యురియాసిటీని పెంచింది. ట్రైలర్‌లో యాక్షన్, హ్యుమర్, రొమాన్స్, మాస్ అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వున్నాయి. డైలాగ్స్‌లో విశ్వక్ సేన్ స్పెషల్ కనిపిస్తోంది. రవితేజ ముళ్లపూడి తన డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విశ్వక్ సేన్ హ్యుమర్, చరిష్మా‌తో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశాడు. మీనాక్షి చౌదరి క్లాసిక్, ట్రెడిషినల్‌గానూ కనిపించగా.. శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయి పాత్రను పోషించింది. నరేష్, వైవా హర్ష కామెడీ రిలీఫ్‌ను అందించగా, సునీల్ మెయిన్ విలన్‌గా చిల్లింగ్ ఇంప్రెషన్‌ని కలిగించాడు. మొత్తంగా ఈ ట్రైలర్ 1.0 రాకీ మాస్ అప్పీల్‌ను ఇంపాక్ట్ ఫుల్‌గా ప్రజెంట్ చేసింది. నవంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్‌తో భారీ అంచనాలు పెరగడం కాయం అని చెప్పొచ్చు.


vishwak-sen.jpg

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంత దూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు (ప్రేక్షకులు). నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 రాకీ సినిమా రిలీజ్. సినిమా మొన్ననే చూసుకున్నా.. చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. నవంబర్ 21, 7.30కి పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. యూఎస్ షో కంటే ముందే చూసుకోండి. అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. సినిమాతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ ఆడిటోరియమ్‌లా మారిపోతాయి. ఇది ట్రైలర్ 1.0, రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. నిర్మాత రామ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయనకి చాలా డబ్బులు రావాలి. శ్రద్ధ వండర్ ఫుల్ కో స్టార్. మీనాక్షి కి థాంక్ యూ సో మచ్. మా కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్ యూ సో మచ్. జేమ్స్ బిజోయ్ బీజీఎం ఇరగదీశాడు. టీంలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ప్రసంగించారు.

Also Read- The Substance: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

Also Read- Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 20 , 2024 | 07:12 PM