Vishwambhara: అనల్‌ అరసు సూపర్ విజన్.. మెగాస్టార్ యాక్షన్!

ABN , Publish Date - Aug 04 , 2024 | 10:37 PM

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రాన్ని సంక్రాంతి రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు నడుస్తోంది. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్లైమాక్స్‌కి ఇండియన్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు యాక్షన్ డిజైన్ చేస్తున్నారు.

Vishwambhara Movie Update

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ చిత్రాన్ని సంక్రాంతి రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు నడుస్తోంది. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజువల్ వండర్‌గా వుండబోతోందని.. వశిష్ట (Vassishta) క్రియేటివ్ అప్రోచ్‌తో ఫాంటసీ ఎలిమెంట్స్‌ని విజువల్ గా మహాఅద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.

Also Read- Chiranjeevi - Ram Charan: మంచి మనసు చాటుకున్నారు.. బాధితులంతా త్వరగా కోలుకోవాలి!

ఈ ఇంటెన్స్ క్లైమాక్స్‌కి ఇండియన్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయినటువంటి అనల్ అరసు (Anl Arasu) యాక్షన్ డిజైన్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తన అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీతో క్లైమాక్స్‌ అవుట్ స్టాండింగ్‌గా వుండబోతోందని, క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలను మించి వుంటుందని మేకర్స్ చెబుతున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ స్కేల్, స్కోప్ చాలా గ్రాండ్‌గా వుంటాయని.. ఇందులో మ్యాసీవ్ సెట్‌లు, విజువల్ ఎఫెక్ట్‌లతో మూవీ ఫాంటసీ నెక్స్ట్ లెవల్ వుండబోతున్నట్లుగా వెల్లడించారు.


Megastar-Chiranjeevi.jpg

ఈ క్లైమాక్స్ షోడౌన్‌లో చిరంజీవి (Chiranjeevi) చరిష్మాటిక్ ప్రజెన్స్‌తో విశ్వంభర మునుపెన్నడూ లేని ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా వుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘విశ్వంభర’లో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు (Chota K Naidu) సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమాను 10 జనవరి, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 04 , 2024 | 10:37 PM

Vishwambhara - Trisha: చిరంజీవి సరసన రెండోసారి! 

Vishwambhara: 'విశ్వంభర’ మహాద్రష్ట ఎవరంటే!

Vishwambhara: ఇట్స్ ఐటెం సాంగ్ టైమ్

Vishwambhara: చిరు సరసన మరో ఇద్దరు చేరారు!

Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’.. డబ్బింగ్ మొద‌లెట్టేశారు