సినిమా రివ్యూ: జ్యుయల్ థీఫ్

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:44 PM

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ విడుదలకు సీజన్‌తో పని లేదు. కంటెంట్‌ బావుండి.. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా ట్రైలర్‌తో ఆకట్టుకున్న చిత్రం  ‘జ్యుయల్ థీఫ్’. ఈ వారం విడుదలైన అరడజను చిత్రాల్లో ఇదీ ఒకటి. మరీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించిందో చూద్దాం.


సినిమా రివ్యూ: జ్యుయల్ థీఫ్  (Jewel Thief )

విడుదల తేది: 08 నవంబర్‌ 2024
నటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్‌, వినోద్‌కుమార్‌. అజయ్‌, ప్రేమ, పృథ్వీ, శివారెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు: కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్‌
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్‌ మీచి?యా
నిర్మాత: మల్లెల ప్రభాకర్‌
డైరెక్టర్‌: పి.ఎస్‌.నారాయణ
 

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ విడుదలకు సీజన్‌తో పని లేదు. కంటెంట్‌ బావుండి.. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా ట్రైలర్‌తో ఆకట్టుకున్న చిత్రం  ‘జ్యుయల్ థీఫ్’. ఈ వారం విడుదలైన అరడజను చిత్రాల్లో ఇదీ ఒకటి. మరీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించిందో చూద్దాం.

కథ: (Jewel Thief Review)
సిన్సియర్‌ ట్రావెల్స్‌ ఓనర్‌ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారు నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. ఓ సందర్భంలో నేహ (మీనాక్షి జైస్వాల్‌) నెక్లెస్‌ కూడా దొంగిలిస్తూ పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్లాడు. కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని నేహ అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్‌ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని సవాల్‌ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెంది, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి సేవలు చేస్తూ అతన్ని బాగు చేస్తాడు.  అదే వ్యక్తిని చంపినట్లు కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ కృష్ణ ఆ కేసులో ఇరికించింది ఎవరు? ఆ కేసు నుంచి బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ   
సినిమా టైటిల్‌ను బట్టి చూస్తే.. దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. కథ ఫ్లేవర్‌ అదే అయినా దీనికి ఓ ప్రేమకథను జోడించారు. నగలు దొంగిలించడం, పేద పిల్లల కోసం వాటిని ఉపయోగించడం మంచి కాన్సెప్ట్‌ అయిన సినిమాను తెరపై చూపించడంతో దర్శకుడు తడబడ్డ భావన కలుగుతుంది. ఫస్టాఫ్‌ అంతా పాత్రల పరిచయం ప్రేమకథతో సోసోగా డల్‌గా నడుస్తుంది. సెకండాఫ్‌ ప్రారంభం నుంచే కథలో వేగం పుంజుకుంటుంది. హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పర్టిక్యులర్‌ ఆ ఎపిసోడ్‌ కన్వెన్‌సింగ్‌గా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. స్క్రీన్ ప్లే మాత్రం సినిమాకు మైనస్‌ అని చెప్పాలి. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నటీనటులు విషయానికొస్తే..
కృష్ణ సాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రేమ సన్నివేశాల్లోనూ మెచూర్డ్‌గా యాక్ట్‌ చేశారు. హెయిర్‌స్టైల్‌, డాన్స్‌, మేనరిజం ఆకట్టుకున్నాయి.  హీరోయిన్‌గా మీనాక్షి జైస్వాల్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటనకు అంతగా ఆస్కారం లేదు. సీనియర్‌ నటులు వినోద్‌కుమార్‌, అజయ్‌, ప్రేమ నటనలో అనుభవం సినిమాకు ప్లస్‌ అయింది. పృథ్వి, శివారెడ్డి వినోదాన్ని పంచారు. సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం బావుంది. నేపథ్య సంగీతంలో ఇంపాక్ట్‌ మిస్‌ అయింది. సినిమాటోగ్రాఫర్‌ అడుసుమిల్లి విజయ్‌ కుమార్‌ కెమెరా పనితనం ఫర్వాలేదనిపించింది. ఎడిటర్‌కు పని చెప్పాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు పర్వాలేదనిపించాయి. మాటలు బాగానే రాసుకున్నారు. ఈతరం మెచ్చే కంటెంట్‌ సినిమాలో ఉన్నప్పటికీ దర్శకుడు కొన్ని సందర్భాల్లో క్లారిటీ మిస్‌ అయ్యారు. కథకు తగ్గట్టు కాస్త గుర్తుపట్టే ఆర్టిస్ట్‌లను తీసుకుని ఉండే రిజల్ట్‌ ఇంకాస్త మెరుగుగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు.. దాన్ని పబ్లిసిటీ చేసి విడుదల చేయడం మరో ఎత్తు. ఇలాంటి తరుణంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని సమయంలో, వరుసగా ఆరు సినిమాల రిలీజ్‌లు, ఎన్నో ఇబ్బందుల మధ్య సినిమా విడుదల చేసే ధైర్యం చేసిన నిర్మాతలను మెచ్చుకోవాలి. సస్సెన్స్‌ థ్రిల్లర్‌ను ఇష్డపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్‌లైన్‌: దొంగతనం మంచికే..

Updated Date - Nov 10 , 2024 | 03:15 PM