Vettaiyan XReview: రజినీకాంత్ ‘వేట్టైయాన్’.. ట్విట్ట‌ర్‌రివ్యూ! సినిమా ఎలా ఉందంటే

ABN , Publish Date - Oct 10 , 2024 | 06:54 AM

గ‌త సంవ‌త్స‌రం జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ న‌టించిన‌ కొత్త చిత్రం ‘వేట్టైయాన్’. అక్టోబ‌ర్ 10న (నేడు) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే చాలామంది సినిమా చూసి ప్రేక్ష‌కులు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే.

vettayan

గ‌త సంవ‌త్స‌రం జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘వేట్టైయాన్’ (Vettaiyan). ద‌ర్శ‌కుడు జై భీమ్ వంటి క‌ల్ట్ చిత్రాన్ని అందించిన‌ టీ.జె.జ్ఞాన‌వేల్ (T. J.Gnanavel) ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా ద‌గ్గుబాటి (Rana), రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

GZeAsZPWQAAk0EP.jpeg

తాజాగా అక్టోబ‌ర్ 10న (నేడు) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో, మ‌న దేశంలో కొన్ని ప్రాంతాల్లో షోలు స్టార్ట్ అవ‌డం, చాలామంది చూడ‌డం కూడా జ‌రిగిపోయింది. దీంతో సినిమా చూసిన‌వారంతా మూవీపై త‌మ వ్యక్తిగ‌త అభిప్రాయాల‌ను వ్య‌క్త ప‌రుస్తున్నారు.సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. మ‌రి సినిమాపై ప్రేక్ష‌కులు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే..


GZfOHdmX0AIXxbi.jpeg

సినిమా ర‌జ‌నీకాంత్ ఇంట్రో బాగా కుదిరింద‌ని కానీ ఫ‌స్టాఫ్ చాలా స్లోగా న‌డిపించార‌ని ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింద‌ని చాలామంది పోస్టులు పెట్టాడుతున్నారు. సినిమాకు అనిరుధ్ (AnirudhRavichander) సంగీతం వెన్నెముక అని మ‌రోసారి త‌నేంటో రుజువు చేసుకున్నాడ‌ని,సెకండాఫ్ సినిమాకు బ‌ల‌మ‌ని అంటున్నారు. సినిమాలో భారీ తారాగ‌ణం ఉన్న‌ప్ప‌టికీ ఆయా పాత్ర‌ల‌కు బాగా యాప్ట్ అయ్యార‌ని, సూట‌య్యార‌న్నారు. ముఖ్యంగా నేటి టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని హ‌త్య‌లు చేస్తున్న ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే నేప‌థ్యంలో సాగే క‌థతో ర‌జ‌నీకాంత్‌తో జ్ఞాన్‌వే ల్ రాజా మంచి ప్ర‌యోగం చేశాడ‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

GZeAsmdXYAAMuXm.jpeg

అయితే సినిమాలో అక్క‌డ‌క్క‌డ అర‌వ వాస‌న‌లు క‌నిపించ‌డం, పేర్లు తెలుగు వారికి కాస్త ఇబ్బంది పెడ‌తాయ‌ని కొంత‌మంది కామెంట్లు పెడుతున్నారు. కొన్ని స‌న్నివేశాలు బోరింగ్‌గా కూడా ఉన్నాయ‌ని, అక్క‌డ‌క్క‌డ స్క్రీన్ ప్లే స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, లాగ్ చేసినట్టుగా అనిపిస్తాయంటున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర నిడివి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ మోప్పిస్తార‌ని ఫాహద్ ఫజిల్, రానా, మంజువారియ‌ర్‌, రితికా సింగ్ పాత్ర‌లు ర‌జ‌నీకాంత్‌తో పోటీ ప‌డ్డాయ‌ని ఓవ‌రాల్‌గా సినిమా హిట్ అవుతుంద‌ని కొంద‌రు బ్లాక్‌ బ‌స్ట‌ర్ అని మ‌రికొంద‌రు పోస్టులు పెడ‌తున్నారు. సినిమా థ్రిల్ల‌ర్‌గా న‌డిచినా భావోద్వేగాలు కూడా ఆక‌ట్టుకుంటాయంటున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 06:54 AM