Allu Arjun: ఐకాన్ స్టార్ కి తగిలిన ఇంకో పెద్ద షాక్ !

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:21 PM

ఈమధ్య ఎక్కువగా వివాదమైన వార్తల్లో ఉంటూ వస్తున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు ఇంకో పెద్ద షాక్ తగిలేటట్టుగా వుంది. అతను, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' విడుదల గురించి ఒక సంచలన వార్త పరిశ్రమలో చర్చగా నడుస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే...

Allu Arjun: ఐకాన్ స్టార్ కి తగిలిన ఇంకో పెద్ద షాక్ !
Allu Arjun from Pushpa 2

ఐకాన్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రీకరణలో బిజీగా వున్నారు. ఈమధ్య అల్లు అర్జున్ ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు, అయితే అందులో ఎక్కువగా వివాదాలతో కూడుకున్నవే ఉండటం ఆసక్తికరం. కొన్ని రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మొత్తం మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కానీ అక్కడ ఒక్క అల్లు కుటుంబ సభ్యుడు కూడా కనబడకపోవడం పరిశ్రమలో చర్చకి దారితీసింది. (Allu Arjun and Sukumar combination 'Pushpa 2' release is postponed indefinitely says sources)

అల్లు అర్జున్ ని కావాలనే కొణిదెల కుటుంబం దూరం పెట్టిందనే వార్తలు సామజిక మాధ్యమాల్లో, మీడియాలో చాలా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కి ఇంకో పెద్ద షాక్ తగలబోతోంది. 'పుష్ప 2' సినిమా ఆగస్టు 15న విడుదలవుతుంది అని ఇప్పటివరకు ఘంటాపథంగా చెప్పుకువస్తున్న చిత్ర నిర్వాహకులు ఇప్పుడు ఆ సినిమా ఆ తేదీకి రావటం లేదని అంటున్నట్టుగా పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. (Pushpa 2 is now releasing in December, accoring to a source)

alluarjunsukumar.jpg

ఇంకా చిత్రీకరణ చెయ్యాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయని, అవి కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పని కోసం సుకుమార్ చాలా సమయం అడిగారని కూడా తెలుస్తోంది. అయితే చిత్ర నిర్మాతలు సుకుమార్ పై చాలా ఒత్తిడి తెచ్చి ఎలా అయినా ఆగస్ట్ 15న విడుదల చేయించాలని విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఒత్తిడితో పని చెయ్యడం చాలా కష్టమని, తనకి తగినంత సమయం ఇవ్వాలని, అందుకని ఆగస్టు 15వ తేదీకి సినిమా రావటం కూడా కష్టమని దర్శకుడు నిర్మాతలతో చెప్పినట్టుగా వార్తలు పరిశ్రమలో నడుస్తున్నాయి. (Allu Arjun gets another shock as his film Pushpa 2 is not releasing on August 15 and postponed indefinitely)

Sukumar---pushpa.jpg

ఇప్పుడు చిత్ర నిర్మాతలు కొత్త తేదీ కోసం వెతుకులాట ప్రారంభించారని కూడా తెలిసింది. అయితే దగ్గరలో వాళ్ళకి ఎటువంటి తేదీలు కనపడలేదని, ఎందుకంటే వేరే పెద్ద సినిమాలు ఆ సమయంలో విడుదలకు ఉన్నాయని, అందువలన ఏకంగా డిసెంబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నటుగా తెలిసింది. ఒకవేళ 'పుష్ప 2' డిసెంబర్ నెలలో విడుదలైతే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుందా అని కూడా చిత్ర నిర్వాహకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా కూడా 'పుష్ప 2' విడుదల వాయిదా పడటం మాత్రం ఖాయం అని పరిశ్రమలో అంటున్నారు. అందువలనే ఎన్టీఆర్, శివ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' విడుదల ముందుకు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు, రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది.

Updated Date - Jun 14 , 2024 | 12:21 PM