Sakshi Vaidya: ఫ్లాప్ హీరోయిన్ కి మళ్ళీ ఎన్ని ఛాన్సులో !

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:46 PM

అఖిల్ తో 'ఏజెంట్' సినిమాతో అరంగేట్రం చేసిన కథానాయిక సాక్షి వైద్య. ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది, తరువాత ఆమె నటించిన 'గాండీవధారి అర్జున' కూడా పెద్దగా నడవలేదు. అయినా టాలీవుడ్ లో సాక్షికి అవకాశాలు బాగానే వున్నాయి.

Sakshi Vaidya: ఫ్లాప్ హీరోయిన్ కి మళ్ళీ ఎన్ని ఛాన్సులో !
Sakshi Vaidya

సాక్షి వైద్య తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అఖిల్ అక్కినేని పక్కన 'ఏజెంట్' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు, హైప్ కూడా వచ్చింది, కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయింది. అయితే ఆ సినిమా విడుదలకి ముందే సాక్షి ఇంకో సినిమా ఒప్పుకుంది. అదే వరుణ్ తేజ్ పక్కన నటించిన 'గాండీవధారి అర్జున', ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయింది. (Akhil heroine gets another big chance in Tollywood)

sakshivaidyanew.jpg

మామూలుగా అయితే టాలీవుడ్ లో వరసగా ఇలా రెండు సినిమాలు ఫెయిల్ అయితే ఆ నటిని ఎక్కువగా తీసుకోవడానికి చిత్ర దర్శకులు, నిర్మాతలు ముందుకు రారు. కానీ విచిత్రంగా సాక్షి వైద్యకి వెంటనే అవకాశాలు వచ్చాయి. ఆమె ఇప్పుడు శర్వానంద్ సినిమాలో నటిస్తోంది. (Sakshi Vaidya debut film and her second film flops, but still she gets good chances in Tollywood)

నిన్న సాక్షి వైద్య లుక్ ఆ సినిమా నుండి విడుదల చేశారు. ఈ శర్వానంద్ సినిమా కాకుండా, ఇంకో కొన్ని సినిమాలు ఆమె వొప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలు నిజంగా ఆమెకి మళ్ళీ ఇంకొక చాన్సు ఇచ్చినట్టే అని చెప్పొచ్చు.

sakshivaidyanewone.jpg

పవన్ కళ్యాణ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' లో కూడా సాక్షి వైద్య వుంది, కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అలాగే సాయి దుర్గ తేజ్ నటించబోయే కొత్త సినిమాలో సాక్షి వైద్యకి అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి. మొదటి రెండు సినిమాలు ఘోరంగా ఫెయిల్ అయినా, ఆ సినిమాలో కథానాయిక అయిన సాక్షి వైద్యకి ఇన్ని అవకాశాలు రావటం ఆసక్తికరం.

Updated Date - Jun 20 , 2024 | 03:46 PM