Emmy Awards: పికాక్‌ థియేటర్‌లో వైభవంగా ఎమ్మీ అవార్డుల వేడుక

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:18 AM

డ్రామా విభాగంలో ‘షోగన్‌’ 25 నామినేషన్స్‌, కామెడీ కేటగిరీలో ‘ది బేర్‌’ 23 నామినేషన్స్‌ దక్కించుకోవడం విశేషం. షోగన్‌ సిరీస్‌ 18 విభాగాల్లో అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించింది.


ప్రపంచ సినిమా పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 76వ ఎమ్మీ అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెలెస్‌లోని పికాక్‌ థియేటర్‌ దీనికి వేదికైంది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. తారలు రెడ్‌ కార్పెట్‌పై హోయలొలికించారు. ఎన్నో సినిమాలు ఈ అవార్డుల కోసం నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. అత్యధికంగా డ్రామా విభాగంలో ‘షోగన్‌’ 25 నామినేషన్స్‌, కామెడీ కేటగిరీలో ‘ది బేర్‌’ 23 నామినేషన్స్‌ దక్కించుకోవడం విశేషం. షోగన్‌ సిరీస్‌ 18 విభాగాల్లో అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించింది. ఇందులో విజేతలుగా నిలిచింది ఎవరంటే..

Emmy.jpg

ఉత్తమ సహాయ నటుడు(కామెడీ) - ఎబోన్‌ మోస్‌ (ది బేర్‌)
ఉత్తమ సహాయ నటి (కామెడీ) - లిజా కోలోన్‌ (ది బేర్‌)
కామెడీ సిరీస్‌ బెస్ట్‌ యాక్టర్‌ (కామెడీ) - జెరెమీ అలెన్‌ వైట్‌ ( దిబేర్‌)
కామెడీ సిరీస్‌ ఉత్తమ నటి (కామెడీ) - జీన్‌ స్మార్ట్‌ (హ్యాక్స్‌)
ఉత్తమ సహాయ నటుడు (డ్రామా) - బిల్లీ క్రుడప్‌ ( ది మార్నింగ్‌ షో)

Shogun.jpg
ఉత్తమ సహాయ నటి (డ్రామా) - ఎలిజబెత్‌ డెబికి ( దిక్రౌన్‌)
ఉత్తమ దర్శకుడు (డ్రామా) - క్రిమ్‌సన్‌ స్కై (షాగన్‌)
ఉత్తమ నటుడు (అంథాలజీ) - రిచర్డ్‌ గ్యాడ్‌(బేబి రెయిన్‌డీర్‌)
ఉత్తమ సహాయనటి (అంఽథాలజీ) - జెస్సికా
ఉత్తమ టాక్‌ సిరీస్‌ - ది డైలీ షో
రియాలిటీ కాంపిటీషన్‌ ప్రొగ్రాం - ధి ట్రైటర్స్‌
గవర్నర్స్‌ అవార్డ్‌ - గ్రెగ్‌ బెర్లాంటి

Emmy 2024.jfif

Updated Date - Sep 16 , 2024 | 11:18 AM