Met gala 2024: అంతర్జాతీయ వేదికపై అలియా హొయలు
ABN , Publish Date - May 07 , 2024 | 11:30 AM
న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024 అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో హాలీవుడ్ స్టార్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించారు.
న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024 (Met Gala 2024) అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో హాలీవుడ్ స్టార్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించారు.
ఈ ఏడాది షో థీమ్ పేరు స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్ కాగా.. డ్రెస్ కోడ్ థీమ్ ది గార్డెన్ ఆఫ్ టైమ్. ఈ షో కోసం ఆలియా భట్ (Aliabhat) చీరలో వెళ్లడం విశేషం. ప్రముఖ డిజైనర్ సభ్యచాచి డిజైన్ చేసిన స్పెషల్ శారీ ని అలియా ధరించింది.
కైలీ జెన్నర్ (Kylie Jenner) కూడా ఈ మెట్ గాలా షోకి హాజరు అయింది ఈసారి ఆమె బాడీకాన్ ఫిట్, ఆఫ్ షౌల్డర్ నెక్లైన్ డ్రెస్ లో కనిపించింది. నటి జెండాయా ఈ మెట్ గాలా 2024 నైట్ కు మైసన్ మార్గీలా గౌన్ లో అలరించింది.
యాక్టర్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ సిల్హొటె, గోల్డెన్ ఫ్లోరల్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ లో ఈ మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్ పై మెరిసింది.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రియాంకా చొప్రా తన భర్త నిక్ తో కలిసి సందడి చేసింది. పలువురు పాప్ సింగర్స్ నటీమణులు మోడల్స్ విభిన్నమైన ఫ్యాషన్ డ్రెస్ లతో ఫోటోలకు ఫోజులిచ్చారు.