Priyanka Chopra: నదియా ఈజ్‌ బ్యాక్‌.. సిటాడెల్‌ సెట్‌లో సందడి

ABN , Publish Date - Sep 19 , 2024 | 10:13 AM

ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్‌’ రెండో సీజన్‌ ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం ఈ సెట్‌ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి (Hollywood)వెళ్లి గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు పొందారు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) . నదియా సిన్హ్‌గా ఆమె నటించిన స్పై థ్రిల్లర్‌గా ’సిటాడెల్‌’ (Citadel) సిరీస్‌ ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం ఈ సెట్‌ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అందులో చిత్రీకరణ సమయంలో ఆమె చేతులకు చిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి సెట్‌లో ఫోట్‌ షేర్‌ చేసి ‘నదియా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ప్రియాంక షేర్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ధావన్‌, సమంత నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘సిటాడెల్‌: హనీ-బన్నీ పేరుతో ప్రసారం కానుంది.

సిటాడెల్‌ కథ ఏంటంటే..

ఎఫ్‌బీఐ, ఎంఐ6, బీఎన్‌డీ, ఎఫ్‌ఎస్‌బీ, రా, ఐఎస్‌ఐలాగే సిటాడెల్‌ అనేది ఒక స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్‌లో దీనిని స్థాపిస్తారు. ఒక్క దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి సంరక్షణ బాధ్యత ప్రధాన లక్ష్యంగా ఈ ఏజన్సీ పనిచేస్తుంది. ‘సిటాడెల్‌’ను ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు ధనిక బృందాలు కలిసి ‘మాంటికోర్‌’ అనే సొంత స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటడెల్‌లో టాప్‌ స్పై ఏజెంట్లు అయిన మేసన్‌ కేన్‌ (రిచర్డ్‌ మ్యాడెన్‌), నదియా సిన్హ్‌ను తప్పుదోవ పట్టించి వాళ్లను అంతం చేసేందుకు మాంటికోర్‌ ప్రయత్నిస్తుంది. మరి ఆ దాడి నుంచి మేసన్‌, నదియా ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? సిటాడెల్‌ను పునరుద్థరించి, మాంటికోర్‌ను అడ్డుకునేందుకు వీళ్లు చేసిన ప్రయత్నం ఏంటి? అన్నది కథ.

Coolie: కింగ్ నాగ్ సీన్ లీక్‌పై లోకేష్ కనగరాజ్ స్పందనిదే..


Updated Date - Sep 19 , 2024 | 10:13 AM