77th Cannes Film Festival : కేన్స్ లో  ఇండియన్  బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌

ABN , Publish Date - May 24 , 2024 | 01:50 PM

77వ కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఉత్తమ లఘు చిత్రంగా ఇండియన్  షార్ట్‌ ఫిల్మ్‌ బహుమతి సొంతం చేసుకుంది. చిదానంద నాయక్‌ తెరకెక్కించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ ఈ ఘనత సాధించింది.

77th Cannes Film Festival : కేన్స్ లో  ఇండియన్  బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌

77వ కేన్స్‌ చిత్రోత్సవాల్లో (77th Cannes Film Festival) ఉత్తమ లఘు చిత్రంగా ఇండియన్  షార్ట్‌ ఫిల్మ్‌ బహుమతి సొంతం చేసుకుంది. చిదానంద నాయక్‌ తెరకెక్కించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ (Sunflowers Were The First Ones To Know) ఈ ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలవడంతో నెటిజన్లు ఈ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫ్రాన్స్‌ వేదికగా 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఘనంగా జరుగుతోంది. మే 14 నుంచి 25వ తేదీ వరకు ఈ వేడుక జరుగనుంది. ఈ వేదిక పై తారలు సందడి చేస్తున్నారు.  ఉత్తమ లఘు చిత్రంగా ఇండియన్ సినిమా సత్తా చాటింది. 

Cannes.jpg

16 నిమిషాల నిడివి ఉన్న  ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్థురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఇందులో చూశారు. ఇప్పుడీ షార్ట్‌ ఫిల్మ్‌ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఇక మీరఠ్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించిన యానిమేటెడ్‌ చిత్రం ‘బన్నీ హుడ్‌’ ఈ పోటీలో తృతీయ బహుమతి గెలుచుకుంది. మే 23న బునుయెల్‌ థియేటర్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఉత్తమ లఘు చిత్రానికి 15,000 యూరోలు, తృతీయ స్థానానికి 7,500 యూరోలతోపాటు ప్రశంస పత్రం అందించారు. తాజాగా ఈ వేడుకలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం టీజర్‌ను కూడా ప్రదర్శించారు. అక్కడ వచ్చిన స్పందనకు మంచు విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. 

Flowe.jpg

Updated Date - May 24 , 2024 | 02:01 PM