నార్సింగిలో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి
ABN , Publish Date - Nov 21 , 2024 | 08:50 PM
బిగ్ బాస్ సెలబ్రిటీలంతా ఒక చోట చేరితే ఎలాంటి సందడి ఉంటుందో.. అలాంటి సందడే నార్సింగిలో నెలకొంది. బిగ్ బిస్ సెలబ్రిటీలు అశ్విని, సౌమ్య జాను, బేబక్కలతో పాటు నటులు క్రిష్, సమీర్, అనిల్, మహేశ్వరి వంటి వారంతా స్వర్ణ ఆవిష్కరించిన సెలూన్ ప్రారంభోత్సవంలో సందడి చేశారు.
ప్రఖ్యాత మెన్, ఉమెన్ పారిస్ బ్రాండ్ సెలూన్ మారియో క్లెయిర్ నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్ ప్రారంభోత్సవంలో పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు అశ్విని, సౌమ్య జాను, బేబక్క (సింగర్ మధు) అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..‘ స్వర్ణ’ మా అందరితో పాటు నటిగా అనేక టీవీ సీరియల్స్‌లో రాణిస్తూనే బిజినెస్ ఉమెన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వర్ణ పెట్టిన ఈ అత్యాధునిక సెలూన్‌లో మేము రకారకాల సర్వీసులు ఆల్రెడీ తీసుకున్నాం. సర్వీసెస్ అన్నీ కూడా ఎంతో బావున్నాయని అన్నారు.
ఆధునిక ఫ్యాషన్, అందానికి ఫ్రెంచ్ స్టైల్ మోడల్‌గా చెబుతుంటారు. అలాంటి ఫ్రెంచ్ బ్యూటీని నగరవాసులు కూడా మారియో క్లెయిర్ ద్వారా పొందవచ్చని నిర్వాహకురాలు స్వర్ణ తెలిపారు. నార్సింగి మారియో క్లెయిర్ సెలూన్‌లో క్రియేటివ్ హెయిర్ మేకోవర్, బ్రైడల్ ప్యాకేజెస్, గ్లోబల్ కలర్, వ్యాక్సింగ్, స్మూతింగ్, కెరాటిన్, మేకప్, బ్యూటీ అండ్ స్కిన్ సర్వీసెస్ మెన్ అండ్ ఉమెన్‌కు అందిస్తామని ఆమె వెల్లడించారు. ఇంకా ఈ సెలూన్ ప్రారంభోత్సవంలో నటులు క్రిష్, సమీర్, అనిల్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.