Bigg Boss 8 Telugu: ఈ వారం నామినేషన్‌లో రచ్చ రచ్చ.. ఆటంతా హరితేజదే
ABN , Publish Date - Oct 16 , 2024 | 10:37 AM
బేబక్క, శేఖర్ బాషా, అభయ్, ఆదిత్య, నైనిక, సోనియా, సీత ఎలిమినేషన్ల తర్వాత ఏడో వారం ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఏడో వారం ఎలిమినేషన్‌కు జరిగిన నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో జరిగిన హ్యాట్ గేమ్‌లో ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..
బేబక్క, శేఖర్ బాషా, అభయ్, ఆదిత్య, నైనిక, సోనియా, సీత ఎలిమినేషన్ల తర్వాత ఏడో వారం ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఏడో వారం హరితేజ, తేజ, గౌతమ్, పృథ్వీ, నికిల్, మణికంఠ, యష్మీ, నబిల్, ప్రేరణ ఎలిమినేషన్ లిస్ట్‌లో నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా రచ్చ రచ్చ అన్నట్లుగా జరిగింది. ఒక్కవారం కాదు.. నామినేషన్‌కే బిగ్ బాస్ రెండు వారాలు తీసుకోగా.. మొత్తంగా ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్లే లిస్ట్‌లో 9 మంది నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియ చూస్తున్న ప్రేక్షకులకు తలనొప్పిని తెప్పించిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే కొందరు కంటెస్టెంట్స్ ఆడిన విధానం మాత్రం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు హ్యాట్ సొంతం చేసుకుని ఆటంతా నాదే అన్నట్లుగా మరోసారి హాట్ టాపిక్ అయింది. (Bigg Boss Telugu Season 8)
Also Read- Akhanda 2: బాలయ్య, బోయపాటి BB4 టైటిల్ పోస్టర్ అదిరిపోలా..
ప్రేరణపై ఉన్న పగతో పృథ్వీ ఆమెకు హ్యాట్ దొరకనీయకుండా అడ్డుకున్నాడు. ఓజీ క్లాన్‌లో మెజార్జీ సభ్యులు ప్రేరణను నామినేట్ చేయాలని చూశారు. ఇక తేజ.. యష్మీని నామినేట్ చేయడంతో మరో రచ్చ మొదలైంది. ఫ్రెండ్‌ని నామినేట్ చేయడం నాకు నచ్చలేదంటూ తేజ రీజన్ చెబుతూ యష్మీని నామినేట్ చేశాడు. విష్ణుని నామినేట్ చేయాలని చూసిన నయని ప్రయత్నాలు ఫలించలేదు. నయనికీ ఉన్న పాయింట్స్ నామినేషన్స్‌కి సరిపడలేదు. దీంతో ఈ రౌండ్‌లో యష్మీని హరితేజ నామినేట్ చేసింది. తర్వాత హరితేజ హ్యాట్ పట్టుకోవడంతో తేజని నామినేట్ చేశాడు నిఖిల్. తేజాని నామినేట్ చేయడానికి కారణం.. అతను గేమ్స్‌లో యాక్టివ్‌గా ఉండటం లేదని వివరణ ఇచ్చాడు. విష్ణుని నామినేట్ చేయాలని చూసిన నయనీపై రివేంజ్ తీర్చుకున్నాడు విష్ణు. కానీ బిగ్ బాస్ నుండి వార్నింగ్ రావడంతో పాటు.. హరితేజ చేసిన పనితో నయని కాకుండా తేజ నామినేట్ అయ్యాడు.
Also Read- Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్
గౌతమ్, నయని తమ నామినేషన్ పాయింట్స్‌ని రివీల్ చేయగా.. నబిల్ సేఫ్ గేమ్ ఆడడం నాకు నచ్చలేదని గౌతమ్ చెబితే.. విష్ణు సరిగా ఆడలేదు అంటూ.. నయని తన కారణాలు తను చెప్పింది. దీంతో హ్యాట్ పట్టుకున్న ప్రేరణ నబిల్‌ని నామినేట్ చేసింది. నబిల్ కూడా వెంటనే గౌతమ్‌పై కౌంటర్ వేశాడు. ఆ తర్వాత హ్యాట్ మళ్లీ హరితేజ చేతికి వచ్చింది. ఆ తర్వాత దాదాపు పెద్ద యుద్ధం జరిగినంత పనైంది. పృథ్వీ, అవినాష్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఒకానొక దశలో వారిద్దరూ కొట్టుకుంటారేమో అని ఇంటి సభ్యులు, షో చూస్తున్నవారు అనుకున్నారంటే.. ఏ రేంజ్‌లో వారి మధ్య గొడవ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అవినాష్, హరితేజల మధ్య కాసేపు ఎపిసోడ్స్ ఇష్యూ నడిచింది. దీనిపై పృథ్వీ వెకిలి కామెంట్స్ చేయగా.. వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వారెవరూ అన్ని ఎపిసోడ్స్ చూడలేదంటూ అవినాష్ ఓపెన్ అయిపోయాడు. దీంతో అవినాష్‌ని హరితేజ నామినేట్ చేసింది. అయితే అనూహ్యంగా అవినాష్ రాయల్ క్లాన్ ఇమ్యూనిటీ షీల్డ్‌ని వాడుకుని.. తను సేవ్ అయ్యాడు. స్వాప్‌గా హరితేజని నామినేట్ చేశాడు. మొత్తంగా రచ్చ రచ్చగా సాగిన ఈ నామినేషన్ ప్రాసెస్‌లో చివరికి హరితేజ, తేజ, గౌతమ్, పృథ్వీ, నికిల్, మణికంఠ, యష్మీ, నబిల్, ప్రేరణ ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. మరి ఈ లిస్ట్‌లో నుండి ఈ వారం బయటికి వెళ్లేది ఎవరో తెలియాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.