Bigg Boss 8 Telugu: అబ్బే.. ఛార్జింగ్ లేదు, ఆ ఏడుపు ఆపండ్రా బాబు
ABN , Publish Date - Oct 18 , 2024 | 09:12 AM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రియాలిటీ షో లో మరో ఎపిసోడ్ చాలా చప్పగా నడిచింది. ఏడోవారం బిగ్ బాస్ ఇచ్చిన ఓవర్ స్మార్ట్ ఫోన్, ఛార్జింగ్‌ల టాస్క్‌లో అస్సలు ఛార్జింగే లేదు అన్నట్లుగా నడిచింది. అసలీ ఎపిసోడ్ ఎలా నడిచిందంటే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రియాలిటీ షో లో మరో ఎపిసోడ్ చాలా చప్పగా నడిచింది. ఏడోవారం బిగ్ బాస్ ఇచ్చిన ఓవర్ స్మార్ట్ ఫోన్, ఛార్జింగ్‌ల టాస్క్‌లో అస్సలు ఛార్జింగే లేదు అన్నట్లుగా నడిచింది. ఒకరిని నొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్పితే.. కొత్తగా ఏం అనిపించలేదు. స్మార్ట్ ఫోన్‌లుగా రాయల్ క్లాన్.. ఛార్జింగ్‌లు ఓజీ క్లాన్ డివైడ్ అయిన తర్వాత పాయింట్స్ కోసం ప్రయత్నం చేయడం ఇంకాస్త వెరైటీగా ప్లాన్ చేసి ఉండొచ్చు. అంతేకానీ, ఎప్పుడూ ఆ ఏడుపులతోనూ, గొడవలతోనూ ఎపిసోడ్ నడిపించాలనుకోవడం.. ఈ షో చూసే వారికి కాస్త చిరాకును తెప్పించింది. ఈ టాస్క్‌లో నబిల్ దగ్గర నుండి తేజ, మణి వద్ద నుండి మెహబూబ్ చార్జింగ్ కొట్టేశారు. లైటర్ సాయంతో రోహిణి, తేజ పాయింట్స్ సంపాదించుకున్నారు. ఇక ఛార్జింగ్ కుండ పగలకొట్టడంతో ఓజీ క్లాన్ నుండి ఓ సభ్యుడ్ని ఎలిమినేట్ చేసే అవకాశం రాయల్ క్లాన్‌కు కల్పించాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో గౌతమ్, నిఖిల్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వారిద్దరూ కొట్టేసుకున్నారు కూడా. ఈ సన్నివేశాలు మరీ చీప్‌గా అనిపించాయి. (Bigg Boss Telugu Season 8)
Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..
ఆ గొడవ తర్వాత ఓజీ క్లాన్ చార్జింగ్ పాయింగ్ రాయల్ క్లాన్‌కు వచ్చింది. ఇక లైటర్‌తో పాయింట్లు సంపాదించాలని ప్రయత్నించగా.. రోహిణి ఆ లైటర్ కొట్టేసి.. పృథ్వీకి ఇచ్చి ఒక పాయింట్ సంపాదించుకుంది. దీంతో హరితేజ ఫైరయింది. హరితేజ కోపాన్ని తట్టుకోలేక రోహిణి మళ్లీ ఆ లైటర్‌ని ఇచ్చేసింది. నిఖిల్‌కి లైటర్ ఇచ్చి హరితేజ కూడా ఒక పాయింట్ సంపాదించుకుంది. ఈ ఫిజికల్ టాస్క్‌లకు భయపడిపోయిన మణికంఠ.. ఈ గేమ్ నుండి తనని తప్పించాలని కోరినా.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీని రాయల్ క్లాన్ తొలగించింది. ఈ విషయంలో మణి, పృథ్వీల మధ్య కాసేపు కోట్లాట నడిచింది. వారిద్దరూ అలా కొట్టాడుకుంటుంటే.. కొందరు ఇంటి సభ్యులు విడిదీయాలని చూస్తే.. ఇంకొందరు ఆ సన్నివేశం చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మణికంఠని రాయల్ టీమ్ లోపల పడుకునేందుకు పిలిచి డీల్ కుదుర్చుకునేందుకు అవినాష్, మెహబాబు తెగ ప్రయత్నించారు. కానీ మణికంఠ నిజాయితీగా వ్యవహరించాడు.
Also Read- Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..
ఇక టేస్టీ తేజ పులిహోర కహానీ కూడా వర్కౌట్ కాలేదు. కూల్ వాటర్, పులిహోరతో పులిహోర కలుపుదామని చూసిన తేజ ఆట సాగలేదు. బయట వర్షం పడుతున్నా.. చార్జింగ్ పాయింట్స్ ఎక్కువ ఇస్తేనే లోపలికి అనుమతి అనే ఆఫర్‌ని ఓజీ టీమ్ తిప్పికొట్టింది. ఓజీ టీమ్ బయటే పడుకుంది. అప్పుడు నిఖిల్ దగ్గర ఉన్న చార్జింగ్‌ని కొట్టేయాలని మెహబూబ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. అలాగే మణికంఠ దగ్గర చార్జింగ్ కొట్టేయాలని చూసిన అవినాష్ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. కానీ మెహబూబ్, మణిపై దాడి చేసి చార్జింగ్ కొట్టేశాడు. మరోవైపు నయని.. మణికంఠ స్థానాన్ని తీసుకున్నట్లుంది. ఎప్పుడూ ఏడుస్తూనే చిరాకు తెప్పిస్తుంది. ఏ విషయం అయినా సరే.. ముందు ఏడుపే ముఖ్యం అన్నట్లుగా నయని వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే ఆమె బయటకి వచ్చేయడం కాయం అన్నట్లుగా ఈ షో చూసేవారంతా అనుకుంటున్నారంటే.. నయని ఎంతగా విసిగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులే కాదు.. లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా అదే చేస్తున్నారు. పదే పదే విసిగిస్తున్న నయనిపై తేజ చిరాకు పడితే.. వెంటనే ఏడుపు మొదలెట్టింది నయని. ఫైనల్‌గా ఈ టాస్క్ విన్నర్ ఎవరనేది శుక్రవారం ఎపిసోడ్‌లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ టాస్క్ విన్నర్, చీఫ్ కంటెండర్, మెగా ఛీఫ్ ఎవరనేది? ఈ టాస్క్ డిసైడ్ చేయనుంది.