Bigg Boss 8 Telugu: ఏం టెన్షన్ పెట్టావయ్యా బిగ్ బాస్.. మొత్తానికి కథ సుఖాంతం
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:01 PM
ఫ్యామిలీ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్‌ని ఆడియెన్స్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి పని పెట్టుకున్న బిగ్ బాస్.. టేస్టీ తేజతో మాత్రం ఓ ఆట ఆడేసుకున్నాడు. మొత్తంగా అయితే ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ కథ సుఖాంతం చేసి.. అందరినీ సంతోషపరిచాడు బిగ్ బాస్. ఇక శుక్రవారం జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పుకుంటే..
హమ్మయ్యా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసింది. టీఆర్పీ కోసం కంటెస్టెంట్స్‌నే కాకుండా వారి ఫ్యామిలీని కూడా వాడుకునే కార్యక్రమం ముగిసింది. ఈ వాడకంలో కూడా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్‌లు ఈ షో ఫాలో అయ్యే వారికి కాస్త ఎంటర్టైన్మెంట్తో పాటు విసుగు కూడా వచ్చిందని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే, టేస్టీ తేజ విషయంలో బిగ్ బాస్ ఆడిన గేమ్ మాములుగా లేదంటే నమ్మాలి. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో 11వ వారం నడుస్తోంది. ఫ్యామిలీ ఎపిసోడ్ అంటూ.. కంటెస్టెంట్స్‌కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి అడుగు పెట్టడం.. వారిని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవడం, అలా వారు ఎమోషనల్ అవుతుంటే బిగ్ బాస్ కెమెరాలో నుండి చూసి ఆనందించడం అనేది ఈ షో మొదటి సీజన్ నుండి జరుగుతున్నదే కాబట్టి కొత్తగా చెప్పుకోవడానికేం లేదు.
Also Read- Amaran: ‘అమరన్’ థియేటర్‌పై బాంబ్ దాడి.. ఏమైందంటే
ఇక ఈ ఫ్యామిలీ ఎపిసోడ్లో టేస్టీ తేజ ఆవేదనకి వస్తే.. ఒకరకంగా బిగ్ బాస్ తేజతో ఆడేసుకున్నాడు. ఆయన నుండి ఎంత ఎమోషన్ని పిండాలో అంతా పిండేశాడు. అందరి ఫ్యామిలీ మెంబర్స్‌ని హౌస్‌లోకి పంపిన బిగ్ బాస్.. టేస్టీ తేజకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఏడిపించేశాడు. వాళ్ల అమ్మ కోసం ఎంతో ఎదురుచూసిన తేజ చివరకు భోరున విలపించేశాడు. అలా ఏడిపించి ఏడిపించి చివరికి తేజకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ముగియబోతుందనే సందర్భంలో సడెన్‌గా తేజ వాళ్ల అమ్మ లక్ష్మీని హౌస్‌లో ఎంట్రీ చేసిన బిగ్ బాస్.. తేజని సర్ప్రైజ్ చేశాడేమో కానీ.. చూస్తున్న ప్రేక్షకులని మాత్రం కాదు. ఎందుకంటే.. ఆమె వస్తుందని అందరికీ ముందే తెలుసు కాబట్టి.
సరే ఈ ఎపిసోడ్లో చివరికి తేజ వాళ్ల అమ్మ వచ్చింది. అంతకు ముందు ప్రేరణ భర్త శ్రీపాద్ వచ్చినప్పుడు కూడా ఈ ఎపిసోడ్ ఎంగేజింగ్గానే నడిచింది. ప్రేరణ భర్త సింప్లిసిటీని చూసి ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. అనంతరం మెగా ఛీప్ కోసం జరిగిన టాస్క్‌లో అవినాష్ గెలిచి, తేజ కోసం వాళ్లని రప్పించమని బిగ్ బాస్‌ని రిక్వెస్ చేయగా.. అప్పుడు అస్సలు డ్రామా మొదలైంది. దాదాపు అర్ధరాత్రి టైమ్‌లో తేజ వాళ్ల అమ్మ నుంచి ఫోన్ రావడం, కాసేపటికే ఆమెను హౌస్‌లోకి పంపడంతో ఒక్కసారి తేజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వస్తూ వస్తూ ఆమె తెచ్చిన చికెన్‌కు సంబంధించి కాసేపు హౌస్‌లో సీన్ నడిచింది. అనంతరం తేజకు ఆమె కొన్ని సలహలు ఇచ్చిన అనంతరం.. బిగ్ బాస్ ఆమెని బయటికి పంపించి.. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్‌కు శుభం కార్డు వేశారు. ఇక వీకెండ్ కాబట్టి.. ఈ శని, ఆదివారాల్లో కింగ్ నాగార్జున ఆడించే ఆటలు, ఎలిమినేషన్స్ ఉంటాయనే విషయం తెలియంది కాదు. చూద్దాం.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో..