Ani Master: జానీ నిరపరాధి అని తేలితే ఏం చేస్తారు..
ABN , Publish Date - Oct 18 , 2024 | 12:06 PM
జానీపై కేసు పెట్టడం విషయంలో నేను షాక్‌లో ఉన్నాను. ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం నన్ను చాలా బాధించిందని అన్నారు కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. తాజాగా ఆమె జానీ మాస్టర్ కేసు విషయమై మాట్లాడేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
జానీ మాస్టర్ కేసు విషయమై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జానీపై కేసు పెట్టడం విషయంలో నేను షాక్‌లో ఉన్నాను. ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం నన్ను చాలా బాధించింది. అది ఒక తెలుగు టెక్నీషియన్‌కి ఇచ్చిన పురస్కారం. జానీ తప్పు చేసినట్లు ఇంకా ఫ్రూవ్ కాలేదు. నేను జానీ దగ్గర రెండు సంవత్సరాలు వర్క్ చేశాను. జానీ మంచివారు. ఎందుకో వారిపై ఆరోపణలు రావటం బాధాకారంగా ఉంది. నిజంగా జానీ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తేలితే ఏంటి? ఒక లేడీ కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నా.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్టం పడాలి. నా కెరీర్‌లో ఎప్పుడూ నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు.
Also Read- Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..
ప్రస్తుత జానీ కేసులో విక్టిమ్ కొన్ని రోజుల వరకు జానీని దేవుడు అని చెప్పింది. విక్టిమ్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేసినప్పుడు హ్యాపీగా ఉండేది. కానీ సడెన్‌గా ఆరోపణలు చేయటాన్ని ఎలా చూడాలి. జానీ నాకు గురువు.. ఆయన ఈ జైలులో ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదనిపిస్తోంది. అమ్మాయి విషయం కాబట్టి సెన్సిటివ్ విషయం కాబట్టి.. ఎవరూ మాట్లాడలేకపోతున్నారు? జానీపై ఇండస్ట్రీలోనే కుట్ర పన్నారనే విషయంపై నేను మాట్లాడలేను. ఏ యూనియన్‌లోనైనా ఇష్యూస్ ఉంటాయి. ఒక డాన్సర్‌కు హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ హెల్ప్ చేసేది జానీ, శేఖర్, భాను మాస్టర్స్. డాన్స్ మాస్టర్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
గతంలో విక్టిమ్‌కు డాన్స్ యూనియన్ కార్డ్ కోసం జానీ మాస్టర్ వైఫ్ గట్టిగా అడిగారు. విక్టిమ్‌కు కార్డ్ ఇవ్వాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి.. కానీ జానీ అధ్యక్షుడుగా ఆమె కార్డ్ ఇవ్వకుండా తొక్కి పెట్టారనటం తప్పు. విక్టిమ్ గతంలో నాతో తనకు హీరోయిన్ అవ్వాలని ఉందని చెప్పింది. ముందు నువ్వు మంచి డాన్సర్ అవ్వమని చెప్పాను. ఏది ఏమైనా జానీ కేసు జడ్జిమెంట్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం..’’ అని కొరియోగ్రాఫర్ అని మాస్టర్ చెప్పుకొచ్చారు.
జానీ కేసుపై డాన్సర్స్ యూనియన్ సభ్యులు:
జానీకి నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేయటం కరెక్ట్ కాదు. జానీ మాస్టర్‌పై 25 సంవత్సరాల నుండి ఇంతవరకు ఒక్క కంప్లైట్ లేదు. జీరో నుంచి జానీ నెంబర్ వన్ స్థాయికి ఎదిగాడు. డాన్సర్స్‌కు కార్డ్‌ను బైలా ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. యూనియన్‌లో సమస్య ఉంటే మేము సాల్వ్ చేసుకుంటాము.. లేదంటే ఫెడరేషన్ ముందుకు తీసుకువెళతాము. కానీ జానీ కేసు కోర్ట్ పరిధిలో ఉంది. అందుకే దీనిపై మేము ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. జానీపై తప్పుడు ప్రచారం వద్దని మనవి. ఎవరికి ఏ ఆపద వచ్చినా జానీ హెల్ప్ చేయటంలో ముందు ఉంటాడు. అందుకే ఆయన రాజకీయ రంగంలోకి వెళ్లాడు. కానీ అతనికి ఈ రకమైన పరిస్థితి రావటం బాధాకరం అని సత్య మాస్టర్ తెలపగా.. విక్టిమ్ వల్ల మా డాన్సర్స్ యూనియన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఎవరికైనా హెల్ప్ చేసే వ్యక్తి జానీ. ప్రస్తుతం ఆయన కుటుంబం ఇబ్బందులు పడుతోంది. అతని వ్యక్తిత్వం తెలుసు కాబట్టి.. కచ్చితంగా జానీ నిర్దోషిగా బయటకు వస్తాడని ఇతర యూనియన్ సభ్యులు అన్నారు.