Sumaya Reddy: దేవాలయానికి ‘డియర్ ఉమ’ హీరోయిన్ విరాళం
ABN , Publish Date - Feb 24 , 2024 | 03:41 PM
‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు సుమయా రెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన పనులన్ని చివరి స్టేజ్‌కి చేరుకున్నాయి. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా సుమయా రెడ్డి సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని.. ఆ దేవాలయానికి విరాళం అందించారు. సినిమాను మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.
‘డియర్ ఉమ’ (Dear Uma) సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు సుమయా రెడ్డి (Sumaya Reddy). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్ని చివరి స్టేజ్‌కి చేరుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో సుమయా రెడ్డి (Heroine Sumaya Reddy) తన బహుముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా సుమయా రెడ్డి సింహాద్రిపురం (Simhadripuram)లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని.. ఆ దేవాలయానికి విరాళం అందించారు.
సింహాద్రిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి (Sri Venkateswara Swamy Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘డియర్ ఉమ’ సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ టీజర్‌ను ఇటీవలే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమె రూ. 1.7 లక్షలు విరాళంగా ఇచ్చారు.
‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయా రెడ్డి, ‘దియా’ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ (Prithvi Amber) జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది
************************
*Janhvi Kapoor: జాన్వీ కపూర్ RC 16పై ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?
************************
*BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?
**************************