Samyuktha: ఈ పోరాటానికి అంతా ముందుకు రావాలి
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:22 PM
ఈ మధ్య వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో దూసుకెళుతోన్న హీరోయిన్ సంయుక్త.. అంతే దూకుడుగా సేవా కార్యక్రమాలలోనూ ముందుంటూ అందరి మనసులు గెలుచుకుంటోంది. ఇప్పటికే మహిళ కోసం ‘ఆదిశక్తి’ అనే సంస్థని స్థాపించిన సంయుక్త.. తాజాగా బసవతారం హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో దూసుకెళుతోన్న హీరోయిన్ సంయుక్త (Heroine Samyuktha).. అంతే దూకుడుగా సేవా కార్యక్రమాలలోనూ ముందుంటూ అందరి మనసులు గెలుచుకుంటోంది. తాజాగా ఆమె బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో పాల్గొంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసం ప్రచారం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంయుక్త తెలిపింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొంది. పలువురు బసవతారకం ఆస్పత్రి వైద్యులతో కలిసి సంయుక్త బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌పై మాట్లాడింది. ఈ ఫొటోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సంయుక్త షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతుండటమే కాకుండా.. సంయుక్త పేరుని ట్రెండ్‌లోకి తీసుకొస్తున్నాయి.
Also Read-Renu Desai: ఉపాసనకు థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
ఇక ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమం గురించి సంయుక్త మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ వాకథాన్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై పోరాటంలో మనమంతా ముందుకురావాలి. ఈ ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ తీసుకురావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్‌ను డిటెక్ట్ చేస్తే చికిత్సతో నయం చేయడానికి వీలు ఉంటుంది. మనమంతా ఈ అవేర్‌నెస్‌లో భాగమవుదామంటూ సంయుక్త పిలుపునిచ్చింది.
మరో వైపు సంయుక్త కూడా మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి, వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ‘ఆదిశక్తి’ అనే సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు ఈ ఆదిశక్తి సంస్థ సపోర్ట్‌గా నిలవనుందని.. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని ఇటీవల సంయుక్త చెప్పుకొచ్చింది.