Pawan Kalyan: పవన్‌కు డిప్యూటీ సీఎం‌తో పాటు కీలక శాఖలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:13 PM

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో నూతనంగా ఎన్నుకోబడిన కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అయితే చేశారు కానీ.. ఏయే శాఖకు ఎవరెవరు మంత్రి అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాజాగా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

Pawan Kalyan: పవన్‌కు డిప్యూటీ సీఎం‌తో పాటు కీలక శాఖలు
Janesena Chief Pawan Kalyan

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో నూతనంగా ఎన్నుకోబడిన కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అయితే చేశారు కానీ.. ఏయే శాఖకు ఎవరెవరు మంత్రి అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు తిరుపతిలో తన మొక్కులు తీర్చుకుని, గురువారం సాయంత్రం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు అంటే నేడు (శుక్రవారం).. చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

Also Read-Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే...

వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే విషయాన్ని చంద్రబాబు ప్రకటించక ముందే కేంద్ర మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణే అనేలా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం జరిగినా.. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమిస్తూ అధికారికంగా విడుదల చేసిన జాబితాలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ శాఖలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లుగా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ప్రకటనతో ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Also Read- Harom Hara Movie Review: ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి హిట్ వచ్చిందా...


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు కేబినెట్‌లో ప్రకటించిన శాఖలివే..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

  • పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి

  • గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి

  • అటవీ - పర్యావరణ శాఖా మంత్రి

  • సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి

Andhra Pradesh Cabinet Ministers List 2024

AP-Ministers.jpgRead Latest Cinema News

Updated Date - Jun 14 , 2024 | 03:29 PM